Rahul Dravid KL Rahul : రాహుల్ ను వెనకేసుకు వచ్చిన రాహుల్
రోహిత్ శర్మ బాట లోనే హెడ్ కోచ్ ద్రవిడ్
Head Coach Rahul Dravid KL Rahul : పేలవమైన ఆట తీరుతో తీవ్ర విమర్శలకు గురవుతున్న కేఎల్ రాహుల్ ను మరోసారి వెనకేసుకు వచ్చే ప్రయత్నం చేశాడు భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Head Coach Rahul Dravid). విచిత్రం ఏమిటంటే ఇటీవలే కెప్టెన్ రోహిత్ శర్మ సైతం సపోర్ట్ చేశాడు.
మరో వైపు భారత క్రికెట్ జట్టు మాజీ స్టార్ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ నిప్పులు చెరిగాడు. బీసీసీఐలో చోటు చేసుకున్నా రాజకీయాలు, సెలెక్షన్ కమిటీలో ఫెవరిటిజం వల్లే కేఎల్ రాహుల్ జట్టులో కొనసాగుతున్నాడంటూ ఆరోపించాడు. అంతే కాదు ఐపీఎల్ లో లక్నో జెయింట్స్ కు స్కిప్పర్ గా ఉండడం కూడా రాహుల్ కు అడ్వాంటేజ్ గా మారిందని పేర్కొన్నాడు.
ఈ తరుణంలో కేంద్ర మాజీ మంత్రి, వక్త, ప్రముఖ రచయిత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఫామ్ లేమితో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడుతున్న కేఎల్ రాహుల్ ను ఎందుకు ఎంపిక చేశారంటూ ప్రశ్నించాడు.
ఇదే సమయంలో వన్డే సీరీస్ కు మిగతా ఫార్మాట్ లకు కేరళకు చెందిన స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పనికి రాడా అంటూ నిలదీశాడు. ఈ మొత్తం వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చ చోటు చేసుకుంది. ఈ తరుణంలో మౌనం వీడాడు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్. కేఎల్ రాహుల్(KL Rahul) ను నిస్సిగ్గుగా సపోర్ట్ చేయడం అతడిపై ఉన్న నమ్మకాన్ని మరింత పోగొట్టుకునేలా చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు.
Also Read : భారత్ గెలిచేనా ఆసిస్ నిలిచేనా