Amrit Pal Singh Comment : స‌వాల్ విసురుతున్న ‘సింగ్’

భార‌త భ‌ద్ర‌త‌కు పెను స‌వాల్

Amrit Pal Singh Comment : ఒక్క సారిగా దేశం ఉలిక్క ప‌డింది. భింద్ర‌న్ వాలే 2.0 గా పిలుచుకుంటున్న అమృత్ పాల్ సింగ్ ఇవాళ చ‌ర్చ‌నీయాంశంగా మారారు. పంజాబ్ లో గ‌త కొంత కాలంగా ఖ‌లిస్తాన్ ఉద్య‌మానికి సంబంధించి ఆన‌వాళ్లు క‌నిపించాయి.

దీనిపై కేంద్ర స‌ర్కార్ ఎప్ప‌టిక‌ప్పుడు ఉక్కు పాదం మోపుతోంది. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం విస్తు పోయేలా చేసింది. 

ఖ‌లిస్తానీ నాయ‌కుడిగా గుర్తింపు పొందారు అమృత్ పాల్ సింగ్. ఆయ‌న సార‌థ్యంలో సింగ్ స‌హాయ‌కుడిని విడుద‌ల చేయాలంటూ ఆందోళ‌న‌కారులు అమృత్ స‌ర్ లోని పోలీస్ కాంప్లెక్స్ పై దాడికి పాల్ప‌డ్డారు.

యావ‌త్ దేశం ఉలిక్కి ప‌డింది. రాష్ట్ర ప్ర‌భుత్వం అస‌మ‌ర్థ‌త‌ను తెలియ చేసింది. ఇక గ‌తంలో భింద్ర‌న్ వాలే అనే స‌రిక‌ల్లా చేసిన దాడులు గుర్తుకు వ‌స్తాయి. అచ్చం ఆనాటి భింద్ర‌న్ వాలేను తల‌పించేలా చేస్తున్నాడు అమృత్ పాల్ సింగ్(Amrit Pal Singh Comment) .

ఆయ‌న త‌ల‌పాగా క‌ట్టే విధానం, వ‌స్త్రాలు, ఇత‌ర మ‌తానికి సంబంధించిన చిహ్నాలు కూడా ప్ర‌త్యేకంగా గుర్తుకు తెచ్చేలా చేశాయి.

కాగా జూన్ 6, 1984లో జ‌రిగిన ఆప‌రేష‌న్ బ్లూ స్టార్ లో చంప‌బ‌డ్డాడు భింద్ర‌న్ వాలే. వేర్పాటు వాద ఖ‌లిస్తానీ ప్రెజ‌ర్ గ్రూప్ వారిస్ పంజాబ్ దే కు త‌నను తాను చీఫ్ గా ప్ర‌క‌టించుకున్నాడు. 

దారుణంగా హ‌త్య‌కు గురైన దీప్ సిద్దూ దీని వ్య‌వ‌స్థాప‌కుడు. ఇప్ప‌టికే ఖ‌లిస్తాన్ అనుకూల నినాదాలు ఢిల్లీలో, కెన‌డాలో , ఆస్ట్రేలియాలో , అమెరికాలో దాడుల‌కు దిగారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు త‌న అనుచ‌ర గ‌ణంతో పోలీస్ స్టేష‌న్ పై దాడికి దిగ‌డం, పోలీసులను గాయ‌ప‌ర్చ‌డం క‌ల‌క‌లం రేపింది. 

ఇక అమృత పాల్ సింగ్ త‌న‌ను తాను జ‌ర్నైల్ సింగ్ భింద్ర‌న్ వాలే 2.0 గా స్థాపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

ప్ర‌స్తుతం పంజాబ్ లో ఆద‌ర‌ణ క‌లిగిన యువ నాయ‌కుడిగా, ఖ‌లిస్తాన్ ప్ర‌తినిధిగా ఆద‌ర‌ణ పొందుతున్నాడు అమృత పాల్ సింగ్. భింద్ర‌న్ వాలే కొత్త అవ‌తారం భారీగా ఆయుధాలు క‌లిగి ఉన్న నిమాంగ్ సిక్కుల సైన్యంతో క‌దులుతోంది. 

వారు ఎక్క‌డికి వెళ్లినా అత‌డిపై పూలు చ‌ల్లుతున్నారు. రెచ్చ‌గొట్టేలా పాట‌లు పాడుతున్నారు. ఇటీవ‌లే అమృత పాల్ సింగ్ స్వ‌ర్ణ దేవాల‌యం ద‌ర్భార్ సాహిబ్ లోకి ప్ర‌వేశించాడు. సిక్కు మ‌తాన్ని ప్రోత్స‌హించేందుకు సింగ్ నెల రోజుల పాటు పంథిక్ వ‌హీర్ ను స్టార్ట్ చేశాడు.

మ‌తం ముసుగులో , మాద‌క ద్ర‌వ్య వ్య‌స‌నం నిర్మూల‌న‌లో త‌న వేర్పాటువాద ఎజెండాను కొన‌సాగిస్తున్నాడ‌ని దేశ భ‌ద్ర‌తా సంస్థ‌లు నిఘా పెంచాయి. ప్ర‌త్యేక మాతృభూమి కావాల‌ని కోరుతున్నాడు. హిందువులు, క్రైస్త‌వులు, ముస్లింల‌కు ప్ర‌త్యేక దేశాలు ఉన్నాయి.

మ‌రి సిక్కుల‌కు ఉంటే త‌ప్పేంటి అని ప్ర‌శ్నిస్తున్నాడు అమృత‌పాల్ సింగ్. తుపాకులు, క‌త్తుల‌ను బ‌హిరంగంగా ప్ర‌ద‌ర్శిస్తున్నారు..ప్ర‌జ‌ల‌ను బెదిరింపుల‌కు గురి చేస్తుండ‌డం కొంత ఆలోచించాల్సిన విష‌యం.

ఆయ‌న మ‌ద్ద‌తుదారుల‌పై ప‌లు కేసులు న‌మోద‌య్యాయి. ఇంత జ‌రుగుతున్నా పంజాబ్ స‌ర్కార్ మౌనం వహించ‌డం ఏమిట‌నేది అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌గా మిగిలి పోయింది.

Also Read : పీఎం చెప్పలేం స‌ర్కార్ ఏర్పాటు ఖాయం

Leave A Reply

Your Email Id will not be published!