Richa Ghosh : ఐసీసీ షార్ట్ లిస్టులో రిచా ఘోష్‌

ప్లేయ‌ర్ ఆఫ్ ది టోర్నీలో చోటు

Richa Ghosh ICC : ద‌క్షిణాఫ్రికాలో జ‌రుగుతున్న ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ మ‌హిళ‌ల టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసేందుకు కేవ‌లం ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇప్ప‌టికే ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకున్నాయి. మొత్తం 10 జ‌ట్లు పాల్గొన్నాయి.

నాలుగు జ‌ట్లు సెమీస్ కు చేరుకున్నాయి. ఆస్ట్రేలియా చేతిలో కేవ‌లం 5 ప‌రుగుల తేడాతో భార‌త జ‌ట్టు ఓడి పోయింది. తొలి సెమీస్ లో ఆసిస్ గెలుపొంద‌గా రెండో సెమీ ఫైన‌ల్ లో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చింది సౌత్ ఆఫ్రికా. బ‌ల‌మైన ఇంగ్లండ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది.

దీంతో అస‌లైన ఫైన‌ల్ పోరు సౌతాఫ్రికా వ‌ర్సెస్ ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య సాగ‌నుంది. ఇక టోర్నీలో ఎవ‌రు అత్యుత్త‌మ క్రికెట‌ర్ అనే దానిపై ఐసీసీ జాబితా సిద్దం చేసింది. వారిలో బార‌త జ‌ట్టుకు చెందిన వికెట్ కీప‌ర్ రిచా ఘోష్(Richa Ghosh ICC)  ఉన్నారు. ఈ రిచ్ లీగ్ లో ఆమె రెండు సార్లు మాత్ర‌మే ఔట్ అయ్యింది. 130 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో స్కోర్ చేసింది. ఇండియా నుంచి ఒకే ఒక్క ప్లేయ‌ర్ కావ‌డం విశేషం. ద‌క్షిణాఫ్రికాతో ఫినిష‌ర్ గా నిలిచింది.

ఇంగ్లండ్ పై అజేయంగా 47 ర‌న్స్ చేసింది. మొత్తం మీద 68 స‌గ‌టుతో 168 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ గా కూడా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించింది. రిచాతో పాటు ఆసిస్ నుంచి ముగ్గురు, ఇంగ్లండ్, సౌతాఫ్రికా నుంచి ఇద్ద‌రు ఆట‌గాళ్లు ఉన్నారు. మెగ్ లానింగ్ 139 ర‌న్స్ , హీలీ 171, యాష్ 81 ర‌న్స్ చేశారు. బ్రంట్ 216 ర‌న్స్ చేసింది.

Also Read : సానియా మీర్జా కోచ్ గా రాణిస్తుందా

Leave A Reply

Your Email Id will not be published!