Medico Preethi Died : ర్యాగింగ్ భూతం ప్రీతి మరణం
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్
Medico Preethi Died : ర్యాగింగ్ భూతం మరో విద్యార్థినిని బలిగొంది. నాలుగు రోజుల తర్వాత సూసైడ్ కు పాల్పడిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన వైద్య విద్యార్థి ప్రీతి మృతి చెందింది. తండ్రి మాత్రం ఇది ఆత్మహత్య కాదని కావాలని చంపేశారంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా నిందితుల ఫోన్లలో వాట్సాప్ చాటింగ్ లు ర్యాగింగ్ ను సూచించాయని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రీతికి 26 ఏళ్లు. ఆమె మృతికి సంతాప సూచకంగా సోమవారం విద్యా సంస్థలను బంద్ చేయాలని విపక్షాలు పిలుపునిచ్చాయి. మొదటి సంవత్సరంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతోంది ప్రీతి . చికిత్స పొందుతూ హైదరాబాద్ లో ఆదివారం రాత్రి మృతి(Medico Preethi Died) చెందింది.
కాకతీయ మెడికల్ కాలేజీలో తన సీనియర్ వేధింపుల కారణంగా ప్రీతి గత బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రిలో రాత్రి షిప్టులో పని చేయడంతో అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.
ప్రీతి తండ్రి ఫిర్యాదు మేరకు ర్యాగింగ్ , సూసైడ్ కు ప్రేరించడం, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై రెండో సంవత్సరం పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి మహమ్మద్ అలీ సైఫ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీనియర్ విద్యార్థిపై కాలేజీ, ఆస్పత్రి అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని ప్రీతి తండ్రి ఆరోపించారు. నిమ్స్ , కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదుట లంబాడ గిరిజన సంఘాలు నిరసన తెలిపాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ , ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఎంజీఎం సూపరింటెండెంట్ , ప్రిన్సిపాల్ , చీఫ్ కు నోటీసులు జారీ చేసింది. అంతకు ముందు గవర్నర్ తమిళి సై పరామర్శించారు. రూ. 10 లక్షలు సాయం ప్రకటించారు.
Also Read : వ్యవస్థలో లోపం ఆత్మహత్యల పర్వం