Twitter Layoffs : ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌కు మ‌స్క్ ఝ‌ల‌క్

మ‌రో 200 జాబ‌ర్స్ కు బిగ్ షాక్

Twitter Layoffs Elon Musk : టెస్లా చైర్మ‌న్ ట్విట్ట‌ర్ బాస్ ఎలోన్ మ‌స్క్ బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్ప‌టికే రూ. 4,400 కోట్లు పెట్టి మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్ట‌ర్ ను చేసుకున్నాక కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టాడు. చాలా చోట్ల ఆఫీసుల‌ను మూసి వేశాడు. కేవ‌లం ప‌ని చేసే వాళ్ల‌కు మాత్ర‌మే ప్ర‌యారిటీ ఉంటుంద‌న్నాడు. కేవ‌లం మూడు నెల‌ల వ‌ర‌కు మ‌త్ర‌మే భ‌రిస్తాన‌ని ఆ త‌ర్వాత మూసి వేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందులో భాగంగా వ‌చ్చీ రావ‌డంతోనే 9,000 మంది ఉద్యోగుల‌ను తొల‌గించాడు.

ఇందులో ప‌ర్మినెంట్ , కాంట్రాక్టు ఎంప్లాయిస్ ను సాగ‌నంపాడు ఎలోన్ మ‌స్క్. కాస్ట్ ఆఫ్ క‌టింగ్ పేరుతో తొలగిండం మొద‌లు పెట్టాడు. తాజాగా 200 మందికి ఝ‌ల‌క్ ఇచ్చాడు. ఇంకొంద‌రికి ఈమెయిల్ యాక్సెస్ ను కూడా తొల‌గించాడు. ఏ రోజు ఏం జ‌రుగుతుందోన‌న్న ఆందోళ‌న ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న వారిలో నెల‌కొంది. ఎందుకంటే చిన్న‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసుకుంటూ వ‌చ్చిన ఎలోన్ మ‌స్క్(Twitter Layoffs Elon Musk) ప్ర‌పంచంలో మోస్ట్ పాపుల‌ర్ బిజినెస్ మెన్ గా పేరొందారు.

అనుకోకుండా ట్విట్ట‌ర్ ను టేకోవ‌ర్ గా చేసుకోవ‌డం ఆ త‌ర్వాత మార్పుల‌కు ప్ర‌యారిటీ ఇస్తూ వ‌చ్చాడు. ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ఆర్థిక మాంద్యం కార‌ణంగా వివిధ రంగాల‌కు చెందిన కంపెనీలు లే ఆఫ్స్(Twitter Layoffs) ప్ర‌క‌టిస్తున్నాయి. మొద‌ట ఎలోన్ మ‌స్క్ ప్రారంభించాడు. ఆ త‌ర్వాత గూగుల్, మైక్రో సాఫ్ట్ , మెటా ఫేస్ బుక్ , అమెజాన్ , త‌దిత‌ర సంస్థ‌లు లక్ష‌కు పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాయి.

Also Read : కొలువుల కోత‌పై ఎరిక్‌స‌న్ ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!