Supreme Court Extends : ప‌వ‌న్ ఖేరా బెయిల్ పొడిగింపు

మార్చి 3 వ‌ర‌కు కోర్టు ఊర‌ట

Supreme Court Extends : ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్య‌లు చేశారంటూ న‌మోదైన కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు ప‌వ‌న్ ఖేరాకు(Pawan Khera) ఊర‌ట ల‌భించింది. ఆయ‌న‌ను అరెస్ట్ చేయొద్దంటూ ముంద‌స్తు బెయిల్ మంజూరు చేసింది. ఛ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ్ పూర్ లో జ‌రిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీన‌రీ స‌మావేశానికి వెళుతుండ‌గా అస్సాంకు చెందిన పోలీసులు ఆయ‌న‌ను రాయ్ పూర్ కు తీసుకు వెళ్లారు. అక్క‌డి నుంచి బ‌ల‌వంతంగా ఢిల్లీకి తీసుకు వ‌చ్చారు.

ఈ మొత్తం ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఎవ‌రినైనా ప్ర‌శ్నించే అధికారం భార‌త రాజ్యాంగం ఇచ్చింద‌ని దానిని కూడా తుంగ‌లో తొక్కారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉండ‌గా కోర్టులో కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇవ్వాలంటూ కోరింది. ఈ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ తో కూడిన ధ‌ర్మాస‌నం ప‌వ‌న్ ఖేరాకు మ‌ధ్యంత‌ర బెయిల్(Supreme Court Extends) ఇచ్చింది. అయితే దీనిని పుర‌స్క‌రించుకుని సీజేఐ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఒక బాధ్య‌త క‌లిగిన ప‌దవుల‌లో ఉన్న వారు మాట్లాడే ముందు వెనుకా ముందు ఆలోచించుకుని మాట్లాడాల‌ని సూచించారు. ఇది ఎవ‌రికైనా వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. ఒక ర‌కంగా అన్ని పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌కు హెచ్చ‌రిక‌గా కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. తాను కావాల‌ని అన‌లేద‌ని, కేవ‌లం దేశం ప‌ట్ల ఒక బాధ్య‌త క‌లిగిన పీఎం ఎలా అదానీకి స‌పోర్ట్ చేస్తాడంటూ ప్ర‌శ్నించాన‌ని చెప్పారు ప‌వ‌న్ ఖేరా. తాను ఎక్క‌డా త‌ప్పుగా మాట్లాడ లేదంటూ కోర్టుకు వివ‌ర‌ణ ఇచ్చారు.

Also Read : కోర్టుకు హాజ‌రైన మ‌నీష్ సిసోడియా

Leave A Reply

Your Email Id will not be published!