Sourav Ganguly KL Rahul : రాహుల్ ఆట తీరుపై దాదా ఫైర్
ఎందుకు ఆడలేక పోతున్నావో చూడు
Sourav Ganguly on KL Rahul : కేఎల్ రాహుల్ ఆట తీరుపై బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇటీవల ఆడిన 7 ఇన్నింగ్స్ లలో కలిపి కేఎల్ రాహుల్ 95 రన్స్ మాత్రమే చేశాడు. పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ అయితే ఏకి పారేశాడు. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ఫెవరిటిజం కారణంగానే ఎంపికవుతూ వస్తున్నాడని ఆరోపించారు.
ఇప్పటి వరకు వైస్ కెప్టెన్ గా ఉన్న రాహుల్ కు పేలవమైన ప్రదర్శన కారణంగా తప్పించడం విస్తు పోయేలా చేసింది. సౌరవ్ గంగూలీ సీరియస్ అయ్యాడు. 10 ఇన్నింగ్స్ లలో 17 దాటక పోవడం విశేషం. అతడి కెరీర్ సగటు 47 మ్యాచ్ లలో 35క పడి పోయింది. ఈ సీరీస్ లో ఇప్పటి దాకా కేవలం 38 రన్స్ చేశాడు. జాతీయ మీడియాతో ఇవాళ సౌరవ్ గంగూలీ(Sourav Ganguly on KL Rahul) మాట్లాడాడు.
ఒక భారత బ్యాటర్ స్వదేశంలో పరుగులు చేయడంలో విఫలమైతే అపారమైన అంచనాలు పెట్టుకున్న వారంతా తీవ్ర విమర్శలు చేయడం ఖాయం. కేఎల్ రాహుల్ ఒక్కడే కాదు గతంలో నాతో పాటు మహేంద్ర సింగ్ ధోనీ కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని తెలిపాడు బీసీసీఐ మాజీ చీఫ్. ఇప్పటి దాకా చాలా సమమయం దక్కింది కేఎల్ రాహుల్(KL Rahul) కు. అయినా అతను ఫోకస్ పెట్టలేక పోయాడంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం సౌరవ్ గంగూలీ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ రంగంలో కలకలం రేపుతున్నాయి.
Also Read : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ షెడ్యూల్