Ned Price : భార‌త్ వ్యూహాత్మ‌క భాగ‌స్వామి – అమెరికా

యుఎస్ ప్ర‌భుత్వ‌ ప్ర‌తినిధి నెడ్ ప్రైస్

Ned Price : అమెరికా ప్ర‌భుత్వం కీల‌క‌మైన ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త దేశంతో త‌మ‌కు అత్యంత ద‌గ్గ‌రి సంబంధాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. ఇందులో ఎలాంటి అనుమానం లేద‌ని పేర్కొంది. ప్ర‌స్తుతం భార‌త్ బ‌లీయ‌మైన ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదుగుతోంద‌ని అభిప్రాయ‌ప‌డింది. ఇదే స‌మ‌యంలో ప్ర‌పంచ దేశాల‌కు సంబంధించి జి20 గ్రూప్ కు భార‌త్ నాయ‌క‌త్వం వ‌హిస్తోంద‌ని తెలిపింది.

అన్ని రంగాల‌లో త‌న‌దైన ముద్ర వేస్తోంద‌ని అమెరికా అభిప్రాయప‌డింది. భార‌త్ తో త‌మ‌కు విస్తృత లోతైన సంబంధాలు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేశారు అమెరికా ప్ర‌భుత్వ ప్ర‌తినిధి నెడ్ ప్రైస్(Ned Price) . భార‌త దేశం అమెరికాకు ప్ర‌పంచ వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అని చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జి20 విదేశాంగ మంత్రుల స‌మావేశంతో స‌హా అనేక కీల‌క స‌మావేశాల‌కు హాజ‌రు కావ‌డానికి యుఎస్ విదేశాంగ కార్య‌ద‌ర్శి టోనీ బ్లింకెన్ ఇండియాకు బ‌య‌లు దేరాని నెడ్ ప్రైస్ వెల్ల‌డించారు.

అంతే కాకుండా బ్లింకెన్ క్వాడ్ మంత్రివ‌ర్గ స‌మావేశానికి కూడా హాజ‌ర‌వుతార‌ని స్ప‌ష్టం చేశారు. ఇదే స‌మ‌యంలో భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ తో భేటీ అవుతార‌ని కీల‌క అంశాల‌పై చ‌ర్చ జ‌రుపుతార‌ని తెలిపారు. తాము ఇటీవ‌ల ఐ2యు2 గురించి మాట్లాడామ‌ని తెలిపారు నెడ్ ప్రైస్(Ned Price) . ఇందులో భార‌త దేశంతో పాటు యూఏఈ కూడా ఉంద‌న్నారు. ఇందులో అమెరికా కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని అందుకే భార‌త్ త‌మ‌కు అత్యంత వ్యూహాత్మ‌క భాగ‌స్వామి అని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.

Also Read : ట్విట్ట‌ర్ ఉద్యోగుల‌కు మ‌స్క్ ఝ‌ల‌క్

Leave A Reply

Your Email Id will not be published!