Amit Shah Focus : ముందస్తు ఎన్నికలపై షా ఆరా
తెలంగాణపై కేంద్ర మంత్రి ఫోకస్
Amit Shah Focus : దక్షిణాదిన పాగా వేయాలన్నది బీజేపీ లక్ష్యం. ఇప్పటికే పలుమార్లు తెలంగాణలో పర్యటిస్తూ వస్తున్నారు బీజేపీ అగ్ర నాయకులు. ఇక్కడి నుంచి కేబినెట్ లో మంత్రి పదవి దక్కింది.
రాబోయే రోజులన్నీ కీలకమైనవని పేర్కొన్నారు అమిత్ షా(Amit Shah Focus). ఒకవేళ సీఎం కేసీఆర్ గనుక ముందస్తు ఎన్నికలకు వెళితే బీజేపీ ఎలా ఎదుర్కోవాలనే దానిపై మంగళవారం సమీక్ష చేపట్టారు.
ఇప్పటికే రోడ్ మ్యాప్ కూడా సిద్దం చేసింది బీజేపీ. అమిత్ షా , జేపీ నడ్డా నేతృత్వంలోని బీజేపీ ఎన్నికలకు సిద్దమైంది. ఈ ఏడాది చివరి నాటికి దక్షిణ రాష్ట్రం కొత్త ప్రభుత్వానికి ఓటు వేయనుంది.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah), పార్టీ చీఫ్ జేపీ నడ్డా తో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఢిల్లీలోని ఆయన నివాసంలో తెలంగాణకు చెందిన ఎన్నికల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ కీలక మీటింగ్ పై సర్వత్రా చర్చ జరుగుతోంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళతారనే ప్రచారం జరుగుతోంది.
దీనిని ఎలా అడ్డుకోవాలనే దానిపై వ్యూహాలు రచించడంపై దృష్టి పెట్టారు. ఈ మీటింగ్ లో స్టేట్ చీఫ్ బండి సంజయ్ , రాష్ట్ర ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ ఉన్నారు. ఇప్పటికే తమ పార్టీ రెడీగా ఉందని ప్రకటించారు స్టేట్ చీఫ్. ఢిల్లీ మద్యం స్కామ్ లో బీఆర్ఎస్ నేత, సీఎం కూతురును అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయాన్ని బీజేపీ సీనియర్ నాయకుడు వివేక్ వెంకటస్వామి ప్రకటించారు కూడా. మద్యం కంపెనీలో 65 శాతం వాటాను కలిగి ఉన్నారంటూ సీబీఐ ఆరోపించింది. కవిత సీఏ ను కూడా అరెస్ట్ చేసింది.
తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను అరెస్ట్ చేశారు. రేపో మాపో కవితను కూడా అదుపులోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.
ఇక బీజేపీ వచ్చే ఎన్నికలకు సంబంధించి బహిరంగ సభలు చేపట్టాలని, క్యాడర్ ను బలోపేతం చేయాలని ఇప్పటికే ఆదేశించారు. ఈసారి ఎన్నికలకు సంబంధించి బండి పదవీ కాలాన్ని పెంచే అవకాశం ఉంది. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 60 సీట్లు వస్తే పవర్ లోకి వస్తుంది.
Also Read : రుణాల తిరిగి చెల్లింపుపై అదానీ ఫోకస్