Sachin Tendulkar Bill Gates : బిల్ గేట్స్ తో టెండూల్కర్ భేటీ
కలవడం గొప్ప అనుభవం
Sachin Tendulkar Bill Gates : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ సచిన్ రమేష్ టెండూల్కర్ ప్రముఖ టెక్ దిగ్గజం బిల్ గేట్స్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ముంబైలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
భారత్ లో పర్యటిస్తున్నారు బిల్ గేట్స్. తాను స్థాపించిన బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా దేశంలో పలు చోట్ల సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వీటిని పరిశీలించేందుకు ఇక్కడికి వచ్చారు బిల్ గేట్స్. బిల్ గేట్స్ దాతృత్వ పనిని, పిల్లల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పలు అంశాలపై ప్రత్యేకంగా చర్చించారు టెండూల్కర్. బిల్ గేట్స్ తో భేటీని(Sachin Tendulkar Bill Gates) అభ్యాస అవకాశంగా పేర్కొన్నారు సచిన్.
ఆలోచనలను పంచుకోవడం ప్రపంచ సవాళ్లను పరిష్కరించేందుకు ఒక మార్గంగా ఉపయోగ పడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. బిల్ గేట్స్ తో తాను కలిసిన ఫోటోలను ట్విట్టర్ మాధ్యమంగా సచిన్ రమేష్ టెండూల్కర్ పంచుకున్నారు.
బిల్ గేట్స్ ను కలిసిన వారిలో సచిన్ తో పాటు ఆయన భార్య అంజలి కూడా ఉన్నారు. ప్రపంచ క్రికెట్ రంగంలో మోస్ట్ పాపులర్ క్రికెటర్ గా పేరొందిన టెండూల్కర్ ను కలవడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు బిల్ గేట్స్. ఇదిలా ఉండగా బిల్ గేట్స్ తో సచిన్ టెండూల్కర్ కలుసుకునేలా చేసింది మెలిండే గేట్స్ ఫౌండేషన్.
ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ సామాజిక, ఆర్థిక సమస్యలపై పని చేస్తుంది. వీటిలో ఆరోగ్య సంరక్షణ మెరుగు పర్చడం , పేదరికాన్ని తగ్గించడం. అంతకు ముoదు బిల్ గేట్స్(Bill Gates) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ను కూడా కలుసుకున్నారు.
Also Read : కేఎల్ రాహుల్ కష్టం గిల్ కు అవకాశం