Vinay Dube CEO : భారీగా విమానాల కొనుగోలు – సిఇఓ
ఆకాసా ఎయిర్ లైన్స్ వినయ్ దూబే ప్రకటన
Vinay Dube CEO : ఆకాసా ఎయిర్ లైన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినయ్ దూబే(Vinay Dube CEO) సంచలన ప్రకటన చేశారు. ఆకాసా ఎయిర్ విమానాల సముదాయాన్ని సంవత్సరానికి మూడు అంకెలలో ఆర్డర్ చేయనున్నట్లు ప్రకటించారు. కంపెనీ వ్యవస్థాపకుడైన ఈ సిఇఓ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సంవత్సరం నాటికి అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరులో లెర్నింగ్ అకాడమీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.
ఆకాసా ఎయిర్ వేస్ కు రాబోయే ఒక దశాబ్దంలో కనీసం 3,500 మంది పైలట్లు అవసరం అవుతారని వెల్లడించారు వినయ్ దూబే. ఆకాసా ఎయిర్ లైన్స్ ఇప్పటికే 72 విమానాల సముదాయాన్ని ఆర్డర్ చేసిందని స్పష్టం చేశారు. వాటిలో ఇప్పటికే 18 డెలివరీ అయ్యాయని తెలిపారు. సంవత్సరం చివరి నాటికి మేము విమానాల కోసం భారీ ఎత్తున ఆర్డర్ చేస్తామన్నారు. అయితే ప్రస్తుతం ఎన్ని అని సంఖ్యను చెప్పలేనని అన్నారు.
కానీ మా ఆర్డర్ మూడు అంకెలలో ఉంటుందన్నారు. ఇది అత్యంత ముఖ్యమైనదని చెప్పారు వినయ్ దూబే(Vinay Dube CEO). బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాదిలో ఆకాసా 300 మంది పైలట్లను నియమించు కోబోతోందని స్పష్టం చేశారు. బెంగళూరు తమకు ప్రధాన కేంద్రం కాబోతోందన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ఎయిర్ లైన్స్ గా అవతరించేందుకు కంపెనీ తన కార్యకలాపాలను ఆరు నెలల పాటు పూర్తి చేసిందన్నారు వినయ్ దూబే.
బెంగళూరు నుండి 36 రోజూ వారీ విమానాలతో ఆకాసా ఎయిర్ నగరంలో మూడో తి పెద్ద దేశీయ క్యారియర్ గా గుర్తింపు పొందిందని సిఇఓ వినయ్ దూబే పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో ముందుకు వెళతామని చెప్పారు.
Also Read : సీపీఆర్ ఎఫ్సీఆర్ఏ లైసెన్స్ రద్దు