WPL 2023 Skippers : అందరి కళ్లు ఆ ఐదుగురి పైనే
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో వారిదే హవా
WPL 2023 Skippers : ప్రపంచ క్రికెట్ లో మొదటిసారిగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో మహిళలకు సంబంధించి ప్రీమియర్ లీగ్ ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీలు, జట్ల ఎంపిక దాదాపుగా ఖరారైంది. ఈ నెలలోనే డబ్ల్యుపీఎల్ ప్రారంభం కానుంది. వేలం పాటలో ముంబై స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది. ఏకంగా రూ. 3.40 కోట్లకు అమ్ముడు పోయింది. మరో విశేషం ఏమిటంటే హైదరాబాద్ టెన్నిస్ దిగ్గజం ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటార్ గా ఎంపిక కావడం. ఆ జట్టుకు మంధాన సారథ్యం వహిస్తున్నట్లు ప్రకటించింది ఆర్సీబీ.
ఇక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL 2023 Skippers) ఎవరి సొంతం అవుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇక జట్ల వారీగా చూస్తే కెప్టెన్లు ఎవరనే దానిపై ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. డబ్ల్యూపీఎల్ కు ఊహించని రీతిలో ఆదాయం సమకూరింది బీసీసీఐకి. మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది తొలి సీజన్. ఈ రిచ్ టోర్నీలో మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఒక్క ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తప్ప మిగతా 4 జట్లు తమ సారథులను ప్రకటించాయి.
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ కు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. గుజరాత్ జెయింట్స్ టీమ్ కు ఆస్ట్రేలియాకు స్టార్ క్రికెటర్ బైత్ మూనీ సారథ్యం వహిస్తారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు స్మృతీ మంధాన స్కిప్పర్ గా ఉంటారు. యూపీ వారియర్స్ టీమ్ కు ఆస్ట్రేలియాకు చెందిన స్టార్ క్రికెటర్ అలీసా హీలీ సారథిగా ఉంటారు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం రోడ్రిగస్ లేదా మెగ్ లాన్నింగ్ కు సారథ్య బాధ్యతలు అప్పగించనున్నారు.
Also Read : జడేజా మ్యాజిక్ ఖవాజా సూపర్