WPL Mascot 2023 : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మస్కట్ రిలీజ్
ట్విట్టర్ వేదికగా పంచుకున్న జే షా
WPL Mascot 2023 : బీసీసీఐ ఆధ్వర్యంలో మార్చి 4 నుంచి మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరారు చేసింది. భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా చేసింది. ప్రారంభ వేడుకులకు సినీ తారలను ఆహ్వానించారు. బుక్ మై షోలో టికెట్లను సేల్ చేస్తోంది బీసీసీఐ. ప్రస్తుతం ఆదాయానికి ఢోకా లేక పోవడంతో బీసీసీఐ ప్రయోగాలకు సిద్ద పడింది. ప్రపంచ క్రికెట్ లో మొదటిసారిగా మహిళలకు సంబంధించి ప్రీమీయర్ లీగ్ ను నిర్వహిస్తోంది.
ముంబై వేదికగా పాటిల్ , వాంఖడే స్టేడియంలలో ఈ మ్యాచ్ లు జరుగుతాయి. ఈనెల 26న ఫైనల్ తో పూర్తవుతుంది ఈ రిచ్ లీగ్. భారీ ఎత్తున బీసీసీఐకి ఆదాయం కూడా సమకూరింది. మొత్తం ఉమెన్స్ ఐపీఎల్ లో ఐదు జట్లు పాల్గొంటాయి. ఉమెన్స్ ప్రీమీయిర్ లీగ్ సందర్బంగా బీసీసీఐ సెక్రటరీ జే షా గురవారం ఐపీఎల్ మస్కట్ ను(WPL Mascot 2023) రిలీజ్ చేశారు. దీనికి శక్తి అని పేరు పెట్టారు. ఇక ఐపీఎల్ లోగో టోర్నీ స్పాన్సర్ గా ప్రముఖ వ్యాపార సంస్థ టాటా కంపెనీ ఉంది.
ఈ మెగా లీగ్ కు మరింత ప్రచారాన్ని తీసుకు రావడంలో భాగంగా మస్కట్ ను విడుదల చేసినట్లు పేర్కొంది బీసీసీఐ. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనికి శక్తి అని పేరు కూడా పెట్టారు. మొదటి మ్యాచ్ లో ముంబై, అహ్మదాబాద్ జట్లు తలపడతాయి. మహిళల వేలం పాటలో అత్యధిక ధరకు అమ్ముడు పోయింది స్మృతీ మంధాన. రూ. 3.40 కోట్లకు ఆర్సీబీ చేజిక్కించుకుంది.
Also Read : ఆస్ట్రేలియా 197 ఆలౌట్