CBI Lalu Prasad Yadav : మెడిక‌ల్ ప్రోటోకాల్ పాటించాం – సీబీఐ

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను విచారించిన సంస్థ

Lalu Prasad Medical Protocol : భూ కుంభ‌కోణం, జాబ్స్ స్కామ్ కేసుల‌కు సంబంధించి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న బీహార్ మాజీ సీఎం లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను మంగ‌ళ‌వారం కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ప్ర‌శ్నించారు. నిన్న ఆయ‌న భార్య , మాజీ సీఎం ర‌బ్రీదేవిని విచారించింది. ఇటీవ‌లే లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సింగ‌పూర్ నుంచి వ‌చ్చారు.

అక్క‌డ ఆయ‌న కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ (మార్పిడి) చేయించుకున్నారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ కూతురు రోహిణి ఆచార్య త‌న కిడ్నీని ఇచ్చింది. ఇటీవ‌ల మాజీ సీఎం త‌న ఇంటికి వ‌చ్చారు. తాజాగా పాట్నాలో ఉన్న లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ను సీబీఐ ప్ర‌శ్నించింది.

ఈ సంద‌ర్బంగా త‌న తండ్రికి ఏమైనా అయితే తాను ఊరుకోనంటూ హెచ్చ‌రించింది లాలూ కూతురు. దీంతో సీబీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాము మెడిక‌ల్ ప్రోటోకాల్ ను(Lalu Prasad Medical Protocol)  పాటించామ‌ని, ఆ మేర‌కే విచార‌ణ చేప‌ట్టామ‌ని స్ప‌ష్టం చేసింది. లాలూకు కిడ్నీ మార్పిడి ఆప‌రేష‌న్ జ‌రిగిందని తెలుసు. ఇన్ ఫెక్ష‌న్ , అలెర్జీ వ‌చ్చే ప్ర‌మాదం ఉంద‌ని , త‌గినంత దూరం పాటించ‌డం , మాస్క్ ధ‌రించామ‌ని తెలిపింది సీబీఐ.

ఇదిలా ఉండ‌గా లాలూ యాద‌వ్ ను మూడు గంట‌ల పాటు ప్ర‌శ్నించింది సీబీఐ. అంత‌కు ముందు మాజీ సీఎం ర‌బ్రీ దేవి వాంగ్మూలం తీసుకుంది. పాట్నా లోని పండారా ప‌రాక్ నివాసంలో ఉద్యోగాల స్కామ్ కు సంబంధించి ప్ర‌శ్నించింది సీబీఐ. లాలూకు ఇద్ద‌రు కూతుళ్లు. ఇద్ద‌రు కుమారులు. కొద్ది రోజుల కింద‌ట లాలూ కుటుంబానికి నోటీసులు కూడా అంద‌జేశామ‌ని తెలిపింది సీబీఐ.

Also Read : సిసోడియా అరెస్ట్ పిన‌ర‌య్ సీరియ‌స్

Leave A Reply

Your Email Id will not be published!