Conrad K Sangma : 24 గంటల్లో మంత్రులకు శాఖలు – సీఎం
కాన్రాడ్ సంగ్మా సంచలన ప్రకటన
Conrad Sangma Cabinet : మేఘాలయ సీఎంగా రెండోసారి కొలువు తీరారు కాన్రాడ్ సంగ్మా. తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పార్టీ 26 సీట్లు సాధించింది. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరికొందరి ఎమ్మెల్యేల సపోర్ట్ తో మంగళవారం రాజ్ భవన్ లో సీఎంగా ప్రమాణ స్వాకీరం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీజీ హాజరయ్యారు. సీఎంగా కొలువు తీరిన వెంటనే సీఎం మీడియాతో మాట్లాడారు.
రాబోయే 24 గంటల్లో మంత్రులకు శాఖలు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పును తాము శిరసా వహిస్తామని చెప్పారు. ఓటు వేసిన ప్రజలకు ఓటు వేయని వారికి కూడా ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు. ఇక నుంచి మేఘాలయ రాష్ట్ర అభివృద్ది కోసం పని చేస్తామన్నారు సీఎం. ఎన్నికల కంటే ముందు ఎన్పీపీ, బీజేపీ కలిసే ఉన్నాయి. కానీ ఆ తర్వాత బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది సీఎంపై , ఆయనకు చెందిన పార్టీపై.
రాష్ట్ర అభివృద్దికి గత ఐదేళ్లలో వేసిన పునాదులపై నే కొనసాగుతామని అన్నారు కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma Cabinet). ఉపాధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఇప్పటికే విద్య, ఆరోగ్యంపై ఎక్కువ ఫోకస్ పెడతామని చెప్పారు మేఘాలయ సీఎం.
ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అట్టడుగు స్థాయిలలో అందేలా చేస్తామన్నారు కాన్రాడ్ సంగ్మా. సంకీర్ణంలో ఎల్లప్పుడూ విభేదాలు వస్తూనే ఉంటాయన్నారు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే కలిసి పని చేయడమన్నారు సీఎం.
Also Read : బీజేపీ కంటే కాంగ్రెస్ బలంగా ఉంది
