న్యూఢిల్లీ : 2025 పహల్గామ్ ఉగ్రదాడిలో ఉగ్రవాదులు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను, 2021లో పాకిస్థాన్‌లోకి దిగుమతి చేసుకున్న ఒక సరుకుకు చెందినదిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఈ సరుకుకు కరాచీకి చెందిన ఫైసల్ బ్యాంక్ ద్వారా నిధులు సమకూర్చబడ్డాయని విచారణలో తేల్చింది. స్వాధీనం చేసుకున్న షియోమీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి, దాడిలో ఉపయోగించడానికి ముందు సంవత్సరాల తరబడి నిష్క్రియంగా ఉందని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. దీనిని ప్రత్యేకంగా ఉగ్రవాద కార్యకలాపాల కోసమే భద్రపరిచారనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
స్వాధీనం చేసుకున్న పరికరాల ఫోరెన్సిక్ విశ్లేషణలో, దాడికి సంబంధించిన ఫోటోలు, మ్యాప్‌లు, నిఘా సమాచారంతో సహా కీలకమైన ఆధారాలు లభించాయి ఎన్ఏఐ. 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఈ ఘోరమైన దాడిలో పాల్గొన్న పాకిస్థాన్ మద్దతుగల ఉగ్రవాద బృందాలకు సహాయపడే లాజిస్టికల్ ,కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల గురించి తెలుసు కోవడానికి ఈ ఆధారాలు ముఖ్యమైన ఆధారాలను అందిస్తాయని ఎన్ఐఏ భావిస్తోంది. తాజాగా పాకిస్తాన్ నిన్నటి దాకా ఈ దాడితో సంబంధం లేదంటూ బుకాయించింది.. కానీ ఇవాళ బట్ట బయలు చేసింది భారత దర్యాప్తు సంస్థ.
ఇదిలా ఉండగా ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. గత కొంత కాలంగా పాకిస్తాన్ పనిగట్టుకుని ఇండియాలో అల్లకల్లోలం రేపేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా టెర్రర్ అటాకింగ్ కు ప్రయారిటీ ఇస్తూ దాడులకు తెగబడుతోంది. అయితే భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నంత వరకు భారత్ ను ఏమీ చేయలేమని భావిస్తోంది పాకిస్తాన్ దేశ సర్కార్.