అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపె రికార్డు
ఫిఫా వరల్డ్ కప్ చరిత్రలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు
అమెరికా : ఫిఫా వరల్డ్ కప్ 2026 చరిత్రలో అత్యధికంగా 22 గోల్స్ చేసిన ఆటగాడిగా ఎంబాపె రికార్డు సృష్టించాడు. మూడు ప్రపంచ కప్‌లలో కలిపి ఈ గోల్స్ సాధించిన ఎంబాపె, ఇప్పుడు అర్జెంటీనాకు చెందిన లియోనెల్ మెస్సీ కంటే ఒక గోల్ ఆధిక్యంలో నిలిచాడు. మయామిలో ఫ్రాన్స్ , ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడవ స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ తరపున తన మొదటి గోల్ సాధించిన తర్వాత కైలియన్ ఎంబాపె సంబురంలో మునిగి పోయాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో రెండు గోల్స్ చేయడం ద్వారా, ప్రపంచ కప్ కెరీర్లో అత్యధిక గోల్స్ సాధించిన రికార్డులో ఎంబాపె లియోనెల్ మెస్సీని అధిగమించి మొత్తం 22 గోల్స్‌కు చేరుకున్నాడు. టోర్నమెంట్లో అత్యధిక గోల్స్ చేసిన వారికి ఇచ్చే ‘గోల్డెన్ బూట్’ రేసులో, మెస్సీ కంటే రెండు గోల్స్ ఎక్కువగా (మొత్తం 10 గోల్స్) ఎంబాపె సాధించాడు.
ఫ్రాన్స్ 0-4తో ఇంగ్లాండ్ కంటే వెనుకబడి ఉన్న సమయంలో 48వ నిమిషంలో ఎంబాపె గోల్‌కీపర్ డీన్ హెండర్సన్‌ను దాటుతూ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపాడు. ఆ తర్వాత 66వ నిమిషంలో సుమారు 14 గజాల దూరం నుండి ఎడమ కాలితో కొట్టిన షాట్‌తో మరోసారి హెండర్సన్‌ను ఓడించి, మెస్సీ పేరిట ఉన్న 21 గోల్స్ రికార్డును అధిగమించాడు. ఎంబాపె చేసిన రెండవ గోల్‌తో ఫ్రాన్స్ స్కోరును 3-4కు దగ్గరగా తీసుకు వచ్చింది. సెమీఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓడి పోవడంతో, వరుసగా మూడవసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడే అవకాశాన్ని ‘లెస్ బ్లూస్’ (ఫ్రాన్స్ జట్టు) కోల్పోయింది. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో జరిగిన టోర్నమెంట్లో ఎంబాపె ఎనిమిది గోల్స్ చేసి గోల్డెన్ బూట్ గెలుచుకున్నాడు . ఆ టోర్నమెంట్ ఫైనల్లో ఫ్రాన్స్ జట్టు మెస్సీ , అర్జెంటీనా చేతిలో పెనాల్టీ షూటౌట్లో ఓడిపోయింది. మూడవ స్థానం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంబాపె ఆరంభం నుండే బరిలోకి దిగాడు.