ముంబై : భారత క్రికెట్ జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించిన హిట్ మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ కానున్నారా. అవునంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోంది. ఈ సందర్బంగా గిల్ సారథ్యంలోని టీమిండియా మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే ఇండియా తొలి మ్యాచ్ లో విజయం సాధిస్తే ఆతిథ్య జట్టు ఇండియాను ఓడించింది. ఇక సీరీస్ విజేతను నిర్దేశించే మ్యాచ్ లార్డ్స్ వేదిక కానుంది. ఇక తాజా అప్ డేట్ ప్రకారం రోహిత్ శర్మ కు ఈ మ్యాచ్ కీలకం, ఆఖరిది కానుందని ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా పార్థివ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. లార్డ్స్ మ్యాచ్ గనుక రోహిత్‌కు చివరిది అయితే, అతను చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.
కాగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే , నమీబియా వేదికగా జరగనున్న 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో తాను లేడంటూ జాతీయ సెలెక్టర్లు రోహిత్‌కు తెలియ జేసినట్లు సమాచారం. ఇంగ్లాండ్‌తో జరగబోయే సిరీస్ నిర్ణయాత్మక మూడవ, చివరి వన్డే రోహిత్ శర్మకు చివరి అంతర్జాతీయ మ్యాచ్ కానుందనే ఊహాగానాల మధ్య, మాజీ భారత ఆటగాడు పార్థివ్ పటేల్ స్పందించారు. విమర్శకుల నోళ్లు మూయించేలా ఒక అద్భుతమైన సెంచరీతో రోహిత్ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని తాను ఆశిస్తున్నట్లు పటేల్ పేర్కొన్నారు. దీనివల్ల ఆదివారం నాటి మ్యాచ్ తర్వాత రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించే లేదా జట్టు నుండి పూర్తిగా తొలగించబడే అవకాశం ఉంది. అతను ఇప్పటికే టెస్టులు, T20 అంతర్జాతీయ మ్యాచ్‌ల నుండి రిటైర్ అయ్యాడు. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మల మధ్య ఎప్పుడూ ఉండే ప్రధాన వ్యత్యాసం ‘నిలకడ గా ఆడటం.