పాఠ‌శాల వివాదంపై తెలంగాణ స‌ర్కార్ కు నోటీస్

జారీ చేసిన జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది హైద‌రాబాద్ లోని పాఠ‌శాల వివాదం. ఇందుకు సంబంధించి త‌క్ష‌ణ‌మే నివేదిక ఇవ్వాల‌ని జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ (ఎన్ హెచ్ ఆర్ సీ) తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసు జారీ చేసింది. ఈ వివాదంపై స్పందిస్తూ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతరావు ఆ ఘటనను ఖండించారు. విద్యా సంస్థలలో మత పరమైన ఆచారాలను రుద్దకూడదని అన్నారు. ఇదిలా ఉండ‌గా సేవా న్యాయ్ ఉత్తాన్ ఫౌండేషన్ దాఖలు చేసిన ఫిర్యాదును కమిషన్ పరిగణనలోకి తీసుకున్నట్లు హ‌క్కుల క‌మిష‌న్ సభ్యుడు ప్రియాంక్ కనూంగో తెలిపారు. హైదరాబాద్‌లోని ఒక పాఠశాలలో హిందూ విద్యార్థులతో ‘కల్మా’ చదివించడం, ఇస్లామిక్ ప్రార్థనలను ఇంటి పనిగా (హోంవర్క్) ఇవ్వడం ద్వారా మత పరమైన వివక్ష చూపారన్న ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.

హైదరాబాద్‌లోని ఒక పాఠశాల పిల్లల పట్ల మతపరమైన వివక్ష చూపుతోందని ‘సేవా న్యాయ్ ఉత్తాన్ ఫౌండేషన్’ అనే సంస్థ నుండి మాకు ఫిర్యాదు అందింది. హిందూ విద్యార్థులను కల్మా చదివేలా బలవంతం చేస్తున్నారని, ఇస్లామిక్ ప్రార్థనలను ఇంటి పనిగా ఇస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 28(3)ని తీవ్రంగా ఉల్లంఘించడమేనని అనిపిస్తోంది. ఈ విషయంపై మేము తెలంగాణ ప్రభుత్వానికి నోటీసు జారీ చేశాం అని కనూంగో చెప్పారు. పిల్లలతో కల్మా చదివించేలా బలవంతం చేస్తున్న ఒక ముస్లిం ఉపాధ్యాయుడు అక్కడ ఉన్నారు. ఇది మతపరమైన విషయం, పిల్లలను ఇలా బలవంతం చేయడం సరైనది కాదు. ప్రభుత్వం ఈ సమస్యను చాలా తీవ్రంగా పరిగణించాలి. ఇది లౌకిక దేశం. ప్రతి ఒక్కరికీ తమ ఇళ్లలో తమ మతాన్ని ఆచరించే హక్కు ఉంది, కానీ విద్యాసంస్థ లోపల కాద‌ని మాజీ ఎంపీ పేర్కొన్నారు.

వెంటనే స్పందించి ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేసినందుకు హోం శాఖను , పోలీసులను అభినందిస్తున్నాను. ఇలాంటి ఘటనలు శాంతిభద్రతల సమస్యలకు దారితీసే అవకాశం ఉన్నందున, ఏ పాఠశాలలోనూ వీటిని సహించ కూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్న‌ట్లు తెలిపారు హ‌నుమంత రావు.

Leave A Reply

Your Email Id will not be published!