జూలై 24న ప్ర‌పంచ వ్యాప్తంగా ‘అమెన్’ విడుదల

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన మూవీమేక‌ర్ ఎస్కే బషీద్‌

హైద‌రాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్న దర్శకుడు, నిర్మాత ఎస్కే బషీద్ నుండి మరో విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్‌బీకే ఫిలిం కార్పొరేషన్ బ్యానర్‌పై, రేగుల నీరజరాణి సమర్పణలో ఆర్ఎన్ఆర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో రూపొందిన అత్యంత ప్రతిష్టాత్మక హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘అమెన్’ జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. అభిరుచిగ‌ల దర్శకుడు, నిర్మాతగా పేరు తెచ్చుకున్న ఎస్కే బషీద్ పలు భాషల్లో విజయవంతమైన చిత్రాలను అందించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంచ‌నాల‌కు అంద‌ని అనూహ్య‌మైన స‌బ్జెక్టులతో ప్ర‌యోగాలు చేసే బ‌షీద్.. ఇప్పుడు ‘అమెన్’ మూవీతో మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.

ఈ సినిమా గురించి ఎస్కే బషీద్ మాట్లాడారు. ఇప్పటి వరకు వచ్చిన హారర్ సినిమాల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేలా ‘అమెన్’ రూపొందించాం అన్నారు. సరికొత్త సస్పెన్స్, భయానక ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాం. కొత్త నటీనటులతో టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌తో సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఎంత భయపెడుతుందో చెప్పలేం… గుండె జబ్బులు ఉన్నవాళ్లు థియేటర్‌కు రావద్దు. ఒంటరిగా కూర్చుని చూసే ధైర్యం ఎవరికీ ఉండదని ముంద‌స్తుగా హెచ్చ‌రించాడు. ఇది కుటుంబ సమేతంగా థియేటర్లలో ఆస్వాదించాల్సిన ఒక భయానక అనుభవం. ఔట్‌పుట్‌పై మాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ చిత్రాన్ని మేమే స్వయంగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అన్నారు బ‌షీర్.

Leave A Reply

Your Email Id will not be published!