బెంగళూరు : కర్ణాటక కోసం ‘మొదటి హారతి’ విధానాన్ని సవరించే ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యడుఉ నరేష్ కుమార్. తిరుమల ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామికి సమర్పించే ‘మొదటి హారతి’ కోసం కొత్త విధానాన్ని (ప్రోటోకాల్) రూపొందించాలని డిమాండ్ చేశారు సీఎం. అయితే ఈ గౌరవం కేవలం రాజకీయ ప్రతినిధులకే పరిమితం కాకుండా, ఆ రోజు తిరుమలలో ఉన్న కర్ణాటకకు చెందిన ప్రముఖులకు కూడా కల్పించాలని ఆయన సూచించారు. తిరుపతి ఆలయానికి మైసూర్ రాజకుటుంబం అందించిన పోషణకు గుర్తింపుగా, సుప్రభాత సేవ తర్వాత జరిగే మొదటి హారతి , నిత్య హారతిని మైసూర్ మహారాజుకు సమర్పించే చారిత్రక సంప్రదాయం ఉండేదని, ఈ ప్రతిపాదన ఆ సంప్రదాయానికి అనుగుణంగా ఉందని కుమార్ పేర్కొన్నారు. సంస్థానాల విలీనం తర్వాత కూడా కర్ణాటక రాష్ట్రం పేరుతో ఈ ఆచారం కొనసాగుతూ వచ్చిందని ఆయన నొక్కి చెప్పారు.
ముఖ్యమంత్రిగా శివకుమార్ ఇటువంటి చారిత్రక సంప్రదాయాలు , మతపరమైన విధానాలను పరిరక్షించడంలోనూ, తగిన పరిపాలనా పరమైన వ్యవస్థను ఏర్పాటు చేయడంలోనూ ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు. ఇది స్వాగతించదగిన పరిణామం అని నరేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికీ హారతి కోసం ఉపయోగించే దీపం , నెయ్యిని మైసూర్ మహారాజు పేరుతోనే సమర్పిస్తూ, ఆ దీర్ఘకాలిక సంప్రదాయాన్ని కాపాడుతున్నారని ఆయన చెప్పారు. మహారాజు ఆలయానికి రాలేక పోయినప్పుడు, ఆయన తరపున దివాన్ లేదా ఇతర సీనియర్ ప్రభుత్వ ప్రతినిధులు హారతిని స్వీకరించేవారని కుమార్ తెలిపారు. అయితే, ప్రస్తుతం స్పష్టమైన పరిపాలనా విధానం లేకపోవడంతో, మహారాజు లేనప్పుడు దేవాదాయ శాఖ అధికారులు హారతిని స్వీకరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత విధానాన్ని సమీక్షించాలన్న శివకుమార్ ప్రతిపాదన స్వాగతించదగినదే అయినప్పటికీ, ఆ గౌరవం కేవలం రాజకీయ పదవుల్లో ఉన్నవారికి మాత్రమే పరిమితం కాకూడదని ఆయన సూచించారు. ప్రోటోకాల్ విధానాలు కేవలం టిటిడి పరిధిలోని ఆలయాలకే పరిమితం కాకుండా, కర్ణాటకలోని ప్రముఖ ఆలయాలలో కూడా వాటి చారిత్రక సంప్రదాయాలు , ఆచారాలకు అనుగుణంగా వీటిని పరిశీలించాలని కుమార్ పేర్కొన్నారు.
