చెన్నై : కేరళ ప్రభుత్వం ప్రారంభించిన భారీ మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచార కార్యక్రమం ఆపరేషన్ తూఫాన్ కోసం అంతర్రాష్ట్ర సహకారం కోసం కేరళ హోం శాఖ మంత్రి రమేష్ చెన్నితాల బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌తో సమావేశం అయ్యారు. ఉన్నత స్థాయి సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. కొనసాగుతున్న ఈ కార్యక్రమం సాధించిన విజయాన్ని చెన్నితాల హైలైట్ చేశారు. దక్షిణ భారతదేశంలోని డ్రగ్ మాఫియాపై ఐక్య కూటమి అవసరాన్ని నొక్కి చెప్పారు. మాదకద్రవ్యాలు వాడుతున్న, అమ్ముతున్న వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విజయ్ మద్దతు తీసుకోవడానికి నేను చెన్నైకి వచ్చాను అని చెన్నితాల అన్నారు. జూన్ 2026లో ప్రారంభించిన ‘ఆపరేషన్ తూఫాన్ ది నార్కో హంట్’ ఇప్పటికే కేరళ వ్యాప్తంగా వేలాది అరెస్టులకు దారి తీసింది.
ఈ ఏడాది ప్రారంభంలో అధికారంలోకి వచ్చిన తమిళనాడులోని కొత్త టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పనితీరు అద్భుతమని కొనియాడారు. ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గత నెల రోజుల్లో ఆయన ప్రజల కోసం ఎంతో చేశారు. ప్రజలు దానితో సంతోషంగా ఉన్నారు… ఇది చాలా పారదర్శకమైన ప్రభుత్వం. ఈ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు కేరళ హోం శాఖ మంత్రి. ఈ ఆపరేషన్ ఆరోగ్య , ఎక్సైజ్ శాఖల సమన్వయంతో నిర్వహించ బడుతుందని . మాదకద్రవ్యాల అక్రమ రవాణాను దాని మూలాల్లోనే నిర్మూలించడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు.
