టీమిండియా కోచ్ గంభీర్ పై శ్రీ‌కాంత్ ఫైర్

త‌న‌ను తొల‌గిస్తేనే తప్పా జ‌ట్టు బాగు ప‌డ‌దు

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ క్రికెట‌ర్ క్రిష్ణ‌మాచారి శ్రీ‌కాంత్ నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం శ్రేయాస్ అయ్య‌ర్ సార‌థ్యంలోని టీమిండియా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌రిగిన టి20 సీరీస్ ను కోల్పోయింది . 4-0 తేడాతో ఘోరంగా ఓట‌మి పాల‌య్యింది. దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు శ్రీ‌కాంత్. ఆయ‌న ప్ర‌ధానంగా అస‌లైన కార‌కుడు జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ అంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. త‌న‌ను తక్ష‌ణ‌మే తొల‌గిస్తేనే త‌ప్పా ఇండియా జ‌ట్టు బాగు ప‌డ‌ద‌ని పేర్కొన్నారు. త‌ను ఓ మీడియా ఛాన‌ల్ తో చిట్ చాట్ సంద‌ర్బంగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

గౌత‌మ్ గంభీర్ ను ఉద్దేశించి ఆయ‌న‌ను ఎవరు ప్రశ్నిస్తారు? ఎవరూ ప్రశ్నించరు. ఆయన్ని తొలగించమని ఎవరైనా అడగగలరా? వాళ్ళు అడగరు. పైగా, రెండు నెలల క్రితం ఆయన ప్రపంచ కప్ గెలిచారు. ఆ తర్వాత, సూర్యకుమార్ యాదవ్ కూడా రెండు నెలల క్రితమే ప్రపంచ కప్ గెలిచారు. ఒక్కొక్కరికి ఒక్కో కొలమానం ఉంటుంది. మీరు సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్‌లను తొలగిస్తుంటే, గంభీర్‌ను కూడా తొలగించండి అని డిమాండ్ చేశారు. ఆయనే అంటరానివాడు. నిన్న మ్యాచ్ తర్వాత కూడా శనగలు తింటూ హాయిగా ఉన్నారు. ఓటమి గురించి ఆయన ఏమాత్రం ఆందోళన చూపలేదని మండిప‌డ్డారు. ఇన్ని వైట్‌వాష్‌లు ఎదురైనా, ఆయన చలించలేదు. గంభీర్ ను ఎవరూ ఏమీ చేయలేరు కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా మాట్లాడతారంటూ ఎద్దేవా చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!