రైతుల కోసం డిస్కమ్ ఈఆర్సీ లైసెన్స్ జారీ

కఠిన షరతులతో కూడిన లైసెన్సు మంజూరు

హైద‌రాబాద్ : తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రైతుల‌కు మేలు చేకూర్చేలా వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టకుండా, విద్యుత్ ఉద్యోగుల హక్కులకు భంగం వాటిల్లకుండా, వినియోగదారులకు విద్యుత్ భద్రత రక్షణ కల్పించే విధంగా ఆంక్షలతో కూడిన లైసెన్సు ను మంజూరు చేసింది. టీజీఈఆర్సీ విద్యుత్ వినియోగ‌దారుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు గాను బ‌హిరంగంగా విచార‌ణ చేప‌ట్టింది. ఈ విచార‌ణ సంద‌ర్బంగా విచారణలో వక్తలు లేవనెత్తిన అభ్యంతరాలు, సూచనలు, సలహాలకు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ పరిగణలోకి తీసుకుంది.

రాజకీయ పార్టీల ప్రతినిధులు, విద్యుత్ ఉద్యోగులు, నిపుణుల అభిప్రాయాలను కమిషన్ గౌరవించింది.వక్తలు ప్రధానంగా 20 అభ్యంతరాలు లేవనెత్తగా, వాటిలో 10 అభ్యంతరాలను సంపూర్ణంగా కమిషన్ సమర్థించింది. మరో ఐదు అభ్యంతరాలను పాక్షికంగా ఆమోదించింది. మిగిలిన మరో ఐదు అభ్యంతరాలను పూర్తిగా కమిషన్ తిరస్కరించింది. లైసెన్స్ జారీఅయిన నాటి నుంచి నాలుగు నెలల కాలంలో ఏడు(7) కండిషన్స్ అమలు చేయాలని ఆదేశించింది. నాలుగు నెలల తర్వాత మరో ఏడు(7) కండిషన్స్ అమలు చేయాలని కమిషన్ నిబంధనలు విధించింది.

TGRPDCL యాజమాన్యం PPAలు, బిజినెస్ ప్లాన్ మూడు నెలల కాలపరిమితిలో కమిషన్ కు అందజేయాలని నిర్దేశించింది. TGSPDCL, TGNPDCL, TGRPDCL మధ్య MOU లకు 65 రోజుల గడువు విధించింది. బల్క్ సప్లై అరేంజ్మెంట్, మాక్ డ్రిల్ తప్పనిసరి చేసింది. విద్యుత్ చట్టం లోని 132(4),131(5) సెక్షన్ల ప్రకారం ట్రాన్స్ ఫర్ స్కీమ్ ( ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజన) ఉండాలని నిభందనలు విధించింది. రైతులు కోరితే విద్యుత్ కనెక్షన్లు జారీ చేయడం ఆగిపోవొద్దు. లోటుపాట్లు రాకూడదు అని స్పష్టం చేసింది. విద్యుత్ సబ్సిడీ , రిటైల్ టారిఫ్ , SLDC షెడ్యూల్ , గ్రిడ్ కనెక్టివిటీ అంశాలు స్పష్టంగా ఉండాలని నిర్దేశించింది.

Leave A Reply

Your Email Id will not be published!