క్రికెట్ ఆట కంటే ఏ ప్లేయ‌ర్ గొప్ప వాడు కాదు : శ్రీ‌కాంత్

ఇప్ప‌టికీ విరాట్ కోహ్లీ ప్ర‌పంచంలో టాప్ ప్లేయ‌ర్

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆట‌గాడు, క్రికెట్ అన‌లిస్ట్ క్రిష్ట‌మాచారి శ్రీ‌కాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గ‌త కొంత కాలంగా బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ నిర్వాకం, భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గంభీర్ తీసుకుంటున్న అసంబ‌ద్ద నిర్ణ‌యాలు టెస్టు, వ‌న్డే, టి20 ఫార్మాట్ ల‌లో జ‌ట్ల ఎంపిక‌లో త‌న ప్ర‌మేయం గురించి ప్ర‌త్యేకంగా ప్రస్తావించాడు. ఓ టీవీ ఛాన‌ల్ తో జ‌రిగిన చిట్ చాట్ లో ఏకి పారేశాడు శ్రీ‌కాంత్. ఆయ‌న ప్ర‌త్యేకంగా విరాట్ కోహ్లీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. జట్టు యాజమాన్యం , కోచింగ్ సిబ్బందికి ఇప్పుడు విరాట్ కోహ్లీ అసలు విలువ అర్థమవుతుందని పేర్కొన్నాడు. జట్టు విజయ పథంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడవచ్చు లేదా భారత క్రికెట్‌కు తామే అసలైన బాస్‌లమని భావించవచ్చు అని ఎద్దేవా చేశాడు క్రిష్ణ‌మాచిరి శ్రీ‌కాంత్.

కానీ, ఈ ఆట కంటే ఎవరూ గొప్పవారు కాదని ప్ర‌తి ఒక్క‌రు గుర్తు పెట్టుకోవాల‌ని సూచించాడు. అద్భుతంగా రాణిస్తూ, కొత్త ఆటగాళ్లు బాధ్యతలు స్వీకరిస్తున్న తరుణంలో విరాట్ కోహ్లీ పట్టుదల, సంకల్పంపై ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఇప్పుడు, ఐర్లాండ్ , ఇంగ్లాండ్ పర్యటనల్లో ఆ ‘కొత్త రక్తం’ (యువ ఆటగాళ్లు) ఘోరంగా విఫలమయ్యాక, కేవలం వన్డే క్రికెట్‌లోనే కాకుండా టీ20 క్రికెట్‌లో కూడా గొప్ప ఆటగాడైన విరాట్ కోహ్లీ విలువ మీకు ఖచ్చితంగా తెలుస్తుందన్నాడు. అతను RCBతో వరుసగా టైటిల్స్ గెలిచాడు, అంటే అతను ఇప్పటికీ తన అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడని అర్థం చేసుకోవాల‌ని పేర్కొన్నాడు శ్రీ‌కాంత్. నిస్సందేహంగా అతను ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్ అని ప్ర‌శంసించాడు.

Leave A Reply

Your Email Id will not be published!