బెంగళూరు | అయోధ్య విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ చేసిన వ్యాఖ్యలపై సోమవారం కర్ణాటక హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తీవ్రంగా స్పందించారు: ఆయన మీడియాతో మాట్లాడారు. వారిని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, ఈ విషయంలో ఎందుకు మొహమాట పడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ నీచమైన చరిత్ర గురించి ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. కులం పేరుతో, మతం పేరుతో రాజకీయాలు చేస్తూ వస్తున్న ఆర్ఎస్ఎస్ జనం నమ్మే స్థితిలో లేరన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పేరుతో వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు. ఈ విషయం బహిరంగంగానే వెల్లడైందని, సిట్ సంచలన ఆరోపణలు కూడా చేసిందన్నారు. అయినా హిందూ భక్తులం అని, హిందూత్వానికి ప్రతినిధులమని, సనాతన ధర్మ పరిరక్షకులమంటూ గొప్పలు పోతున్న నేతలు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు ప్రియాంక్ ఖర్గే.
నేనైనా, నా పార్టీ అయినా లేదా వ్యక్తులైనా, సంస్థలైనా భారత రాజ్యాంగానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇందులో ఎవరికీ మినాయింపు ఉండదన్నారు. ఆ విషయం తెలుసకుంటే మంచిదన్నారు. వేల కోట్లను వెనకేసుకుంటూ వస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు సంస్థగా ఎందుకు నమోదు చేసుకోలేదని, ఒకవేళ అలా ఉంటే లెక్క పత్రాలు బయటకు చెప్పాలని డిమాండ్ చేశారు మరోసారి హోం శాఖ మంత్రి . ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు క్షమాపణలు కోరడంలో వారు దిట్ట కదా? వారి చరిత్ర అదే కదా? సావర్కర్ ఎన్నోసార్లు క్షమాపణలు చెప్పారన్నారు. వీరిని కూడా ఒక్కసారి అలా చెప్పమనండి. జైలుకు వెళ్ళినవారు వీహెచ్పీ (VHP)కి చెందినవారే కదా?
వారు అధికారికంగా ఎవరితో అనుబంధం కలిగి ఉన్నారు? వీహెచ్పీ వ్యవస్థాపకులు ఎవరు?… తమ సొంత వర్గంలో (తమకు అనుకూలమైన వారి మధ్య) క్షమాపణలు చెప్పడంలో అర్థం ఏముంది? మిగతా పనులన్నీ బహిరంగంగానే చేస్తారు కదా… అలాగే (మోహన్ భగవత్) తనకు ఎంత మొత్తం వచ్చిందో ప్రకటించాలని డిమాండ్ చేశారు. . ఆ పత్రాలను నా ముఖం మీదే విసిరికొట్టి, నా నోరు మూయించమనండి. ఆర్ఎస్ఎస్ను అధికారికంగా నమోదు చేయించండి, అప్పుడు నా నోరు మూత పడుతుందని ప్రకటించారు. అంత దాకా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు.
