ప్ర‌తిప‌క్షాల మ‌ద్ద‌తు లేకుండా బిల్లు పెడితే ఎలా..?

నిప్పులు చెరిగిన ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ కేసీవీ

న్యూఢిల్లీ : మోదీ కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ, ఎంపీ కేసీ వేణుగోపాల్. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌త్యేకించి ఆయ‌న డీ లిమిటేష‌న్ బిల్లు గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ప్రతిపక్షాల మద్దతు లేకుండా వారు ఆ బిల్లును ఎలా ప్రవేశ పెడ‌తారంటూ ప్ర‌శ్నించారు. ఎలాంటి ఛాన్స్ లేనే లేద‌ని పేర్కొన్నారు. ఒక దేశం – ఒక ఎన్నిక అనే అంశం గురించి కూడా ప్ర‌స్తావించారు. ఇదిలా ఉండ‌గా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుండి ఆగస్టు 13 వరకు జరగనున్నాయి . ఇదే స‌మ‌యంలో కేంద్రం ప్రతిపాదిత ‘ఒక దేశం – ఒక ఎన్నిక’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే ముందు ప్రభుత్వం ప్రతిపక్షాలతో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ చట్టం ముందుకు సాగదని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాల మద్దతు లేకుండా వారు ఆ బిల్లును ఎలా తీసుకురాగలరు? వారు తప్పక ప్రతిపక్షాలతో చర్చించాలని పేర్కొన్నారు.

వారు ఏమి తీసుకు రాబోతున్నారో మాకు ఒక అవగాహన కలగనివ్వండి, ఆ తర్వాత మేము మా అభిప్రాయం చెబుతామని అన్నారు కేసీ వేణుగోపాల్. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024 , కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024లను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ పార్లమెంటు పరిశీలన కోసం సమర్పించే ముందు జూలై 17న తన నివేదికను ఖరారు చేసి ఆమోదించే అవకాశం ఉన్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు, 2024 అనేది ఒకే దేశం, ఒకే ఎన్నికగా ప్రాచుర్యం పొందిన సంస్కరణకు సంబంధించినది; ఇది లోక్‌సభ , రాష్ట్ర శాసనసభలకు ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేలా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లు, 2024 కూడా దేశ వ్యాప్తంగా ఏకకాల ఎన్నికల అమలును సులభతరం చేసే విస్తృత విధానంలో ఒక భాగమేన‌ని పేర్కొన్నారు కేసీ వేణుగోపాల్.

Leave A Reply

Your Email Id will not be published!