సోనం వాంగ్ చుక్ ఎవ‌రో నాకు తెలియ‌దు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన హీరో అమీర్ ఖాన్

ముంబై : బాలీవుడ్ న‌టుడు అమీర్ ఖాన్ మాట మార్చాడు. త‌ను న‌టించిన 3 ఇడియట్స్ అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఇది ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, ప్ర‌జాస్వామిక కార్య‌క‌ర్త అయిన సోనం వాంగ్ చుక్ జీవిత క‌థ ఆధారంగా తీసుకుని సినిమా చేసిన‌ట్లు అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. కానీ ఇప్పుడు వాంగ్ చుక్ మోదీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాడు. ఆయ‌న దేశ వ్యాప్తంగా విద్యా శాఖా ప‌రంగా నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల్లో చోటు చేసుకున్న లీకేజీలు, అక్ర‌మాల‌పై నిల‌దీస్తున్నాడు. ఢిల్లీ కేంద్రంగా కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లో పాల్గొన్నారు. ఆపై నిరాహార‌దీక్ష కూడా చేప‌ట్టాడు. ఈ త‌రుణంలో కోర్టు కూడా జోక్యం చేసుకుంది. ఆయ‌న ప్రాణం చాలా విలువైన‌ద‌ని, త‌క్ష‌ణ‌మే వైద్య సాయం అందించాల‌ని రాష్ట్ర స‌ర్కార్ ను ఆదేశించింది .

ఈ త‌రుణంలో 3 ఇడియట్స్ మూవీలో కీ రోల్ పోషించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అమీర్ ఖాన్ ఉన్న‌ట్టుండి స్వ‌రం మార్చాడు.శుక్ర‌వారం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ‘3 ఇడియట్స్’లో నా పాత్ర సోనమ్ వాంగ్‌చుక్ ఆధారంగా రూపొందించ లేద‌ని పేర్కొన్నాడు. సినిమా తయారీ సమయంలో తనకు గానీ, రచయితలకు గానీ సోనమ్ వాంగ్‌చుక్ గురించి తెలియదని ఆమిర్ ఖాన్ చెప్పారు. ఇదంతా అపోహ అని కొట్టిపారేశారు. అలాగే, ఆ సామాజిక కార్యకర్త చేస్తున్న నిరాహార దీక్ష పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. లండన్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ఖాన్‌ను, వాంగ్‌చుక్ నిరసన గురించి స్పందించమని ఒక విలేకరి కోరారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Leave A Reply

Your Email Id will not be published!