సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష భ‌గ్నం..ఆస్ప‌త్రికి త‌ర‌లింపు

గ‌త 20 రోజులుగా నిరాహార‌దీక్ష‌కు దిగిన ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌

న్యూఢిల్లీ : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన దీక్ష‌కు మ‌ద్ద‌తు తెలిపారు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, ప్ర‌జాస్వామిక కార్య‌క‌ర్త సోన‌మ్ వాంగ్ చుక్. ఆయ‌న గ‌త 20 రోజులుగా నిరాహార‌దీక్ష‌కు దిగారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణిస్తున్నా దీక్ష విర‌మించ‌లేదు. దీంతో ప‌రిస్తితి అదుపు త‌ప్పింద‌ని గ్ర‌హించడంతో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. త‌న ప్రాణం ముఖ్య‌మ‌ని వెంట‌నే మెరుగైన వైద్య స‌హాయం అందించాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. దీంతో నిన్న రాత్రి సోన‌మ్ వాంగ్ చుక్ దీక్ష‌ను భ‌గ్నం చేశారు. త‌న‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు పోలీసులు.

లడఖ్‌కు చెందిన ఇంజనీర్, విద్యా సంస్కర్త, పర్యావరణ కార్యకర్త అయిన వాంగ్‌చుక్ నీట్ పేపర్ లీక్ వివాదంతో సహా దేశవ్యాప్త పరీక్షల అక్రమాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేప‌ట్టారు. వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించిన తర్వాత నిరసన ప్రదేశంలో భారీగా ఢిల్లీ పోలీసు బలగాలను మోహరించారు. జూలై 20న వాంగ్‌చుక్ ,అతని మద్దతుదారులు పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించాలని తలపెట్టిన రెండు రోజుల ముందు ఈ పరిణామం చోటుచేసుకుంది. అతని ఆరోగ్యం , ఆసుపత్రికి తరలించడానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదేశంలో వాంగ్‌చుక్‌పై దాడి జరిగిందని ఆరోపించారు. ఆరోగ్య పరీక్షల ప్రకారం అతని బరువు 56.55 కిలోలుగా నమోదైంది, అంటే 24 గంటల్లో 350 గ్రాముల తగ్గుదల కనిపించింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ సతీష్ లాంబా తెలిపిన వివరాల ప్రకారం, అతని రక్తపోటు 108/68, రక్తంలో చక్కెర స్థాయి 70 mg/dL నాడి వేగం నిమిషానికి 72గా నమోదయ్యాయి.

Leave A Reply

Your Email Id will not be published!