ఇరాన్ : మధ్య ప్రాచ్యంలో మరోసారి యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా యుద్ధాన్ని కొనసాగిస్తే సర్వనాశనం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ లో ఉన్నతాధికారి రెజాయి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కీలక ఒప్పందాన్ని ఉల్లంఘించడమే కాకుండా ఎలాంటి హెచ్చరికలు లేకుండా అమెరికా దాడులకు తెగబడటం దారుణమన్నారు. దౌత్యం , చర్చలు రెండూ ముగిశాయని, అమెరికా తదుపరి సైనిక చర్య పరిస్థితిని తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసేలా చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా సయ్యద్ మొజ్తబా ఖమేనీకి సీనియర్ సైనిక సలహాదారుగా ఉన్న మొహ్సెన్ రెజాయి ఇవాళ తీవ్రంగా స్పందించారు దాడులకు సంబంధించచి.
14-అంశాల అవగాహన ఒప్పందం విఫలమైన తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్పై అమెరికా తన సైనిక చర్యను కొనసాగిస్తే, కేవలం ప్రతీకార దాడులకే పరిమితం కాకుండా పూర్తి స్థాయి దండయాత్ర చేస్తామని , అంతే కాకుండా శత్రువును పూర్తిగా తుడిచిపెట్టే స్థాయికి వెళ్తామని రెజాయి హెచ్చరించారు. సంఘర్షణ కొనసాగితే ఇరాన్ తన ప్రతిస్పందనను కేవలం ప్రతీకార చర్యలకే పరిమితం చేయదని ఆయన మరింత హెచ్చరించారు. ఈ వ్యూహాన్ని అమలు చేస్తే, మేము కేవలం అదే తరహా ప్రతీకారంతో సరిపెట్టుకోవాలని అనుకోవడం లేదన్నారు రిజాయి. ఇరాన్ దాడి చేసే బలగాల నుండి ఏ రాజకీయ సరిహద్దు కూడా రక్షణ కల్పించ బోదంటూ మరోసారి హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ప్రతీకార దాడులలో భాగంగా గల్ఫ్ అంతటా అమెరికా ఆస్తులపై ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ సైనిక సామర్థ్యాలను దెబ్బ తీయడమే తమ కార్యకలాపాల లక్ష్యమని అమెరికా పేర్కొంది. మరోవైపు అమెరికా బలగాలు, ప్రాంతీయ స్థావరాలపై మరిన్ని ప్రతిచర్యలు ఉంటాయని ఇరాన్ హెచ్చరించింది తీవ్ర స్థాయిలో.
