72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మ‌మ్ముట్టి, కార్తీక్ ఆర్య‌న్, యామీ గౌత‌మ్

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల జాబితాను ప్ర‌క‌టించింది. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌లకు ఉత్తమ నటుడు, యామీ గౌతమ్‌కు ఉత్తమ నటి పురస్కారం వెల్ల‌డించింది. భారతీయ సినిమా రంగంలో వివిధ విభాగాలలో సాధించిన అత్యుత్తమ విజయాలను గుర్తిస్తూ చలనచిత్ర పురస్కారాల విజేతలను ప్రకటించారు. మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌లు తమ అద్భుతమైన నటనకు గాను ఉత్తమ నటుడి పురస్కారాన్ని పంచుకోగా, యామీ గౌతమ్ ఉత్తమ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారు. ‘అమరన్’ ఉత్తమ దర్శకత్వ పురస్కారాన్ని, ‘పుష్ప 2’ ఉత్తమ స్క్రీన్‌ప్లే పురస్కారాన్ని, ‘లక్కీ భాస్కర్’ ఉత్తమ ప్రత్యేక సంభాషణల పురస్కారాన్ని, ‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ నిర్మాణ రూపకల్పన పురస్కారాన్ని, , ‘భూల్ భులయ్యా 3’ ఉత్తమ సౌండ్ డిజైన్ పురస్కారాన్ని అందుకున్నాయి.

ఉత్తమ తెలుగు చిత్రం – కమిటీ కుర్రోళ్లు
ఉత్తమ మేకప్‌ – పి.రవికుమార్‌ (కమిటీ కుర్రోళ్లు)
బెస్ట్ డైలాగ్ రైటర్‌ – వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్‌)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ (ఒరిజనల్‌) – సుకుమార్‌ (పుష్ప-2)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ – దీపాలి నూర్‌, శీతల్ శర్మ (పుష్ప-2)
ఉత్తమ బాలల చిత్రం – 35 చిన్న కథ కాదు
ఉత్తమ పాపులర్ చిత్రం – కల్కి 2798 ఏడీ
అవార్డులు లైవ్‌ 44
ఉత్తమ చిత్రం – ఆర్టికల్ 370
ఉత్తమ నటుడు – మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్‌ (సంయుక్తంగా)
ఉత్తమ నటి – యామీ గౌతమ్‌ (ఆర్టికల్ 370)
ఉత్తమ దర్శకుడు – రాజ్‌కుమార్ పెరియస్వామి (అమరన్‌)
ఉత్తమ నేపథ్య గాయని – వైకోం విజయలక్ష్మి (ఏఆర్‌ఎం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – అభయ్ జోధ్ పుర్కర్‌
బెస్ట్ సినిమాటోగ్రఫర్ – జలాల్‌ (భ్రమయుగం)
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం – కెప్టెన్‌ మిల్లర్‌ (తమిళం)
అవార్డులు లైవ్‌ 33
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్‌ – నితిన్ జిహానీ చౌదరి (కల్కి 2798 ఏడీ)
బెస్ట్ ఎడిటర్ – కలైవన్నన్‌ (అమరన్)
బెస్ట్ సౌండ్ డిజైనర్‌ – మానస్ చౌదరి (భూల్ బులియా)
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్‌ – యోగేశ్ దేశ్‌పాండే
ఉత్తమ పాటల రచయిత – మనోజ్‌ ముంతాసిర్ (మైదాన్‌)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ – జీవీ ప్రకాశ్ కుమార్‌ (అమరన్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు) – శశ్వంత్ సచ్‌దేవ్‌ (ఆర్టికల్ 370)
అవార్డులు లైవ్‌ 22
ఉత్తమ తమిళ చిత్రం – రాయన్
ఉత్తమ మలయాళ చిత్రం – ఫెమినిస్ట్ ఫాతిమా
ఉత్తమ కన్నడ చిత్రం – మిథ్య (ఇల్యూజన్‌)
ఉత్తమ హిందీ చిత్రం – శ్రీకాంత్
ఉత్తమ గుజరాత్‌ చిత్రం – మారన్ (ద హంట్‌)
ఉత్తమ బెంగాలీ చిత్రం – చల్‌చిత్ర ఎఖో
అవార్డులు లైవ్‌ 11
బెస్ట్ ఫిల్మ్‌ క్రిటిక్‌ – సంజీవ్ శ్రీవాస్తవ (హిందీ)
సినిమాలపై ఉత్తమ పుస్తక రచయిత – ప్రదీప్‌కుమార్ శెట్టి (కన్నడ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్‌ మెన్షన్‌ – ద చోలా డోరా ఔర్‌ సూయి
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: స్పెషల్‌ మెన్షన్‌ – భద్రకాళి నాటకం
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ స్క్రిప్ట్‌ – ఓబుర్‌
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ సినిమాటోగ్రఫీ – లైవ్‌ ఇన్ లూమ్‌
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డైరెక్షన్‌ – ఆనంద్‌ రాయ్‌ (స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ)
నాన్‌ఫీచర్ ఫిల్మ్ క్యాటగిరీ: బెస్ట్ డాక్యుమెంటరీ – రామ్‌ నమీ
స్పెషల్ మెన్షన్‌ – మేయళగన్‌ (తమిళం)
స్పెషల్ మెన్షన్‌ – తమిళ చిత్రం కెప్టెన్ మిల్లర్‌ (ధనుష్‌)

Leave A Reply

Your Email Id will not be published!