విద్యార్థుల‌కు క‌ర్ణాట‌క సీఎం డీకే బంప‌ర్ ఆఫర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా బ‌స్సు పాసులు జారీ

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర నూత‌న ముఖ్య‌మంత్రిగా క‌ర్ణాట‌క ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆ వెంట‌నే ఆయ‌న సంచ‌ల‌న నిర్ణయాలు ప్ర‌క‌టించారు. త‌మ ప్ర‌భుత్వం గ‌తంలో ఇచ్చిన హామీల‌ను తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తుంద‌ని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. విద్య‌, వైద్యం, ఉపాధికి పెద్ద‌పీట వేస్తామ‌న్నారు. మౌలిక స‌దుపాయ‌ల క‌ల్ప‌న‌పై ఫోక‌స్ పెడ‌తామ‌న్నారు డీకే శివ‌కుమార్. ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన తొలి పత్రికా సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడారు. కర్ణాటక నాయకత్వంపై నెలల తరబడి సాగిన ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడిందని అన్నారు. తన పదోన్నతి ‘ఆలస్యమైంది కానీ నిరాకరించ బడలేదని స్ప‌ష్టం చేశారు . ఇందులో భాగంగా తాము ఇచ్చిన హామీలకు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు.

విద్యా ప‌రంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాల, కళాశాల విద్యార్థులందరికీ ఉచిత బస్సు పాస్‌లు ఇస్తున్న‌ట్లు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ్రామాల్లో 10,000 భారత్ జోడో యూత్ క్లబ్‌లు ఉన్నాయ‌ని, ఒక్కో క్లబ్‌కు రూ.10 లక్షల ప్రభుత్వ మద్దతు ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు డీకే శివ‌కుమార్. నిరుద్యోగ యువత కోసం ఒక జాబ్ రిజిస్ట్రీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. అభ్యర్థులను ఉద్యోగాలతో అనుసంధానించడానికి ప్రభుత్వం కంపెనీలతో కలిసి పని చేస్తుందని చెప్పారు నూత‌న ముఖ్య‌మంత్రి. దీనిని స‌యువ యుగం’గా అభివర్ణిస్తూ, తన ప్రభుత్వం విద్యార్థులు, ఉద్యోగాలు , యువత సాధికారతపై దృష్టి సారిస్తుందని డీకే అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!