19వ ఆటా మహాసభల కోసం వైయస్‌ జగన్‌కు ఆహ్వానం

మాజీ సీఎంను క‌లిసిన ఆటా ప్రెసిడెంట్ జ‌యంత్ చ‌ల్లా

తాడేప‌ల్లిగూడెం : అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ను ఆటా ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్బంగా రావాలంటూ త‌న‌ను ఆహ్వానించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌ను కలిశారు ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు . ఈ సంద‌ర్బంగా జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైయస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటి చెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్‌కు వివరించారు.

Leave A Reply

Your Email Id will not be published!