అహ్మదాబాద్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కిప్పర్ రజత్ పాటిదార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో ఫైనల్ లో తలపడింది ఆర్సీబీ. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. అనంతరం ఆర్సీబీ 18 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. కేవలం 5 వికెట్లు కోల్పోయి ఈఘనతను సాధించింది. 18 ఏళ్లు సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ రెండోసారి టైటిల్ ను కైవసం చేసుకోవడం. గత ఏడాది కూడా ఆర్సీబీ విజేతగా నిలిచింది. అరుదైన రికార్డును స్వంతం చేసుకుంది. ఇదిలా ఉండగా వచ్చే సారి కూడా ఐపీఎల్ 20 సీజన్ ను తామే టైటిల్ ను కైవసం చేసుకుంటామని ప్రకటించింది యాజమాన్యం.
ఇక మ్యాచ్ అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ రజత్ పాటిదార్ మీడియాతో మాట్లాడాడు. గత ఏడాది టైటిల్ కైవసం చేసుకున్న సందర్బంగా భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో సన్మాన కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ సందర్భంగా రజత్ పాటిదార్ ఆ నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈసారి తాము సాధించిన ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ ను ప్రత్యేకించి తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆర్సీబీ ఫ్యాన్స్ కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు రజత్ పాటిదారు. సహజంగానే, మీకు బాధగా ఉంటుంది. ఆట గెలిచిన తర్వాత మీరు మీ అభిమానులను కోల్పోయారు. కేవలం అభిమానులే కాదు, వాళ్ళు కుటుంబ సభ్యుల వంటి వారని పేర్కొన్నారు కెప్టెన్.
