‘రామాయ‌ణం’ ట్రైల‌ర్ రిలీజ్ ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా య‌శ్

ఢిల్లీ వేదిక‌గా గ్రాండ్ గా విడుద‌ల చేసిన చిత్ర బృందం

న్యూఢిల్లీ : ఢిల్లీ వేదిక‌గా అంగ‌రంగ వైభ‌వంగా రామాయ‌ణం చిత్రం ట్రైల‌ర్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ప్ర‌ముఖ న‌టుడు యశ్ ఆకస్మిక ప్రవేశం చేశారు. రావణుడి పాత్ర పోషించి, ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ నటుడికి, ట్రైలర్ విడుదలకు ముందు రణబీర్ కపూర్ , తారాగణంతో చేరగా ఘన స్వాగతం లభించింది. ‘రామాయణం’ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో యశ్ ఎవరికీ చెప్పకుండా అకస్మాత్తుగా ప్రత్యక్షమై అభిమానులను, మీడియాను ఆశ్చర్య పరిచారు. ఈ చిత్రాన్ని ఆయన భారతదేశపు కల అని అభివర్ణించారు. ఇక ఈ కార్యక్రమం ఒక ఊహించని క్షణంతో ముగిసింది. మీడియా కోసం ట్రైలర్ ప్రదర్శించిన తర్వాత యశ్ ఆకస్మికంగా ప్రవేశించడం ఆ సాయంత్రానికే హైలైట్‌గా నిలిచింది. కార్యక్రమం ముగుస్తున్నట్లు అనిపించగా, ఆడిటోరియం అంతా చీకటిమయమైంది.

ఆ తర్వాత నాటకీయమైన లైటింగ్ వెలుగులో యశ్ వేదికపై కనిపించారు. ఆయన రాకకు ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున చప్పట్లు, ఈలలు , కేరింతలతో స్వాగతం లభించింది. జూలై 24న ట్రైలర్ విడుదల కానున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమానికి చిత్ర తారాగణం , సృజనాత్మక బృందం హాజరయ్యారు. ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషించి, నమిత్ మల్హోత్రాతో పాటు నిర్మాతలలో ఒకరిగా ఉన్న యష్, వేదికపైకి వచ్చి సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఘనత అంతా నమిత్ మల్హోత్రాకే దక్కాలి. వారు నాకు ఈ పాత్రను అందించినందుకు, వారికి ధన్యవాదాలు అని అన్నారు. హిందీ నేర్చుకోవడానికి ఇప్పుడు అవకాశం లభించింది. ఇది భారతదేశపు కల అని నేను భావిస్తున్నాను. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరూ మన కథను ప్రపంచ వేదికపైకి తీసుకు రావాలనే ఒకే దృష్టితో, ఒకే నమ్మకంతో వచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!