జ‌పాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్

రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాల‌న్న బాబు

అమ‌రావ‌తి : జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన పి.వి. సింధును అభినందించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు . భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అకనే యమగుచిపై 21-17, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి, రెండేళ్లకు పైగా విరామం తర్వాత తన మొదటి టైటిల్‌ను కైవసం చేసుకున్న 31 ఏళ్ల సింధు, జపాన్ ఓపెన్ గెలిచిన తొలి భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. కీలక సమయాల్లో వ్యూహాత్మక క్రమశిక్షణ, సంయమనంతో కూడిన దూకుడుతో ఆమె ఈ విజయాన్ని నమోదు చేసింది. జపాన్ ఓపెన్ విజేతగా నిలిచిన పి.వి. సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్ర‌త్యేకంగా అభినందించారు.

ఈ విజయం భారతీయ బ్యాడ్మింటన్‌కు గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అకనే యమగుచిపై వరుస సెట్లలో విజయం సాధించినందుకు ఆమెకు అభినందనలు తెలుపుతూ, రాబోయే టోర్నమెంట్లలో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జపాన్ ఓపెన్ గెలిచే క్రమంలో యమగుచిపై అద్భుతమైన విజయం (వరుస సెట్లు: 21-17, 21-17) సాధించిన పి.వి. సింధుకు హృదయ పూర్వక అభినందనలు. భారతీయ బ్యాడ్మింటన్‌కు ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి! ఒలింపిక్స్‌కు ఆల్ ది బెస్ట్, అమ్మా అని నాయుడు ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. రెండుసార్లు ఒలింపిక్ పతకం సాధించిన సింధు, స్థానిక క్రీడాకారిణి అకనే యమగుచిని వరుస సెట్లలో ఓడించి, తన కెరీర్‌లో మొదటి ‘సూపర్ 750’ టైటిల్‌ను జపాన్ ఓపెన్‌లో కైవసం చేసుకుంది. ఇందుకోసం ఆమె తనదైన శైలిలో దూకుడుతో కూడిన బ్యాడ్మింటన్ ప్రదర్శనను కనబరిచింది. సింధు గతంలో 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 2019లో ప్రపంచ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత, జపాన్ ఓపెన్ విజయం ఆమె సాధించిన అత్యంత పెద్ద టైటిల్ ఇదే.

Leave A Reply

Your Email Id will not be published!