చెర్రీ పెద్ది మూవీ టికెట్ రేట్ల పెంపు

ఓకే చెప్పిన తెలంగాణ ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ : బుచ్చిబాబు స‌న ద‌ర్శ‌క‌త్వం వహించిన చిత్రం పెద్ది. ఈ సినిమా లో రామ్ చ‌ర‌ణ్, జాహ్న‌వి క‌పూర్, శివ రాజ్ కుమార్ , జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర పోషించారు. ప్ర‌స్తుతం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది. నిన్న‌టి వ‌ర‌కు ఉత్కంఠ రేపింది టికెట్ ధ‌ర‌ల పెంపు వ్య‌వ‌హారం. అటు ఏపీలో అక్క‌డి కూట‌మి స‌ర్కార్ పెంచేందుకు ఓకే చెప్పింది. కానీ తెలంగాణ స‌ర్కార్ మొద‌ట ఒప్పుకోలేదు. ఆ త‌ర్వాత ఏమైందో ఏమో కానీ ఎట్ట‌కేల‌కు త‌మ నిర్ణ‌యం మార్చుకుంది. ఇప్ప‌టికే ఏ ఒక్క‌రికి బెనిఫిట్ షోస్ కు అనుమ‌తి లేద‌ని బ‌హిరంగంగా ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి ఉండ‌లేదు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో కాంగ్రెస్ స‌ర్కార్ న‌డ‌వ‌డం లేద‌ని టీడీపీ వెన‌క నుంచి న‌డ‌పిస్తోంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇక సినీ ఇండ‌స్ట్రీ మొత్తం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. దీంతో వారు ఏం చెబితే అదే కొన‌సాగుతోంది ఇక్క‌డ‌.

తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది పెద్ది మూవీకి సంబంధించి. ‘పెద్ది’ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం, గ్రాండ్ రిలీజ్‌కు ముందు సినిమాకు పెద్ద ఊపునిచ్చింది. సవరించిన టికెట్ ధరలు, ప్రత్యేక ప్రీమియర్ స్క్రీనింగ్‌లకు సంబంధించి ప్రభుత్వ తుది ఆమోదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ నిర్ణయం శుభవార్తగా వచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ప్రపంచవ్యాప్త థియేట్రికల్ విడుదలకు ఒక రోజు ముందు, అంటే జూన్ 3న రాత్రి 8 గంటలకు ‘పెద్ది’ చిత్రానికి ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించడానికి అనుమతి లభించింది. దీంతో తొలి వారం రోజుల్లోనే భారీగా క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!