అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ కథ ముగిసింది. రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఛాంపియన్ గా రెండోసారి అవతరించింది. అన్ని విభాగాలలో సమిష్టిగా రాణించింది. తనకు ఎదురే లేదని చాటింది. నిన్నటి దాకా కాలర్ ఎగురేసిన గుజరాత్ టైటాన్స్ ఆర్సీబీ చేతిలో చావు దెబ్బ తింది. ఏకంగా 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ బౌలర్ల దెబ్బకు విల విల లాడారు ప్లేయర్లు. టాప్ ఆర్డర్ తక్కువ స్కోర్ కకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ లోని మోదీ స్టేడియం క్రిక్కిరిసి పోయింది. కోట్లాది మంది ఫైనల్ మ్యాచ్ ను ఆసక్తిగా ఎదురు చూశారు.
కానీ ఆర్సీబీ ఈ మ్యాచ్ ను అవలీలగా కైవసం చేసుకుంది. ఆడుతూ పాడుతూ గెలిచింది. ప్రధానంగా ఈసీజన్ లో బెంగళూరుకు మరో సారి గుండెకాయ లాగా మారాడు రన్ మెషీన్ విరాట్ కోహ్లీ. జట్టు ఫైనల్ కు రావడంలో తను ముఖ్య భూమిక పోషించాడు. ఫైనల్ మ్యాచ్ లో కూడా తనదైన శైలిలో ఆడాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 155 రన్స్ చేసింది. అనంతరం 156 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే పూర్తి చేశారు ఆర్సీబీ ఆటగాళ్లు. కోహ్లీ 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 75 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ 16 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు 2 సిక్సర్లతో 32 రన్స్ చేసి జట్టుకు టైటిల్ ను అందించారు. ఇక గుజరాత్ జట్టులో వాషింగ్టన్ సుందర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 50 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.
