వ‌న్డే మ్యాచ్ ల‌కు శుభ్ మ‌న్ గిల్ స‌రిపోడు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ర‌విశాస్త్రి

అహ్మ‌దాబాద్ : మాజీ భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్, ప్ర‌ముఖ కామెంటేట‌ర్ ర‌విశాస్త్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఐపీఎల్ 19వ సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ఆర్సీబీ బౌల‌ర్ల ధాటికి కుప్ప‌కూలింది గుజ‌రాత్ . కేవ‌లం 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 155 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఆ జ‌ట్టు ఇచ్చిన టార్గెట్ ను అల‌వోక‌గా ఛేదించింది రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు. కేవ‌లం 5 వికెట్లు కోల్పోయి సాధించింది. విరాట్ కోహ్లీ మ‌రోసారి మెరిశాడు. స‌త్తా చాటాడు. త‌ను 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 75 ర‌న్స్ చేశాడు. నాటౌట్ గా నిలిచాడు. త‌న జ‌ట్టుకు టైటిల్ తీసుకు రావ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు.

ఇక గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ , ఓపెన‌ర్ గా త‌ను విఫలం అయ్యాడు. కేవ‌లం 10 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు. రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తో సెంచ‌రీతో క‌దం తొక్కాడు. 104 ర‌న్స్ చేశాడు. కానీ ఫైన‌ల్ మ్యాచ్ లో తేలి పోయాడు. ఆర్సీబీ బౌలర్ల దెబ్బ‌కు విల విల లాడాడు. ఈ సంద‌ర్బంగా ర‌విశాస్త్రి సీరియ‌స్ కామెంట్స్ చేశాడు. శుభ్ మ‌న్ గిల్ పెద్ద మ్యాచ్‌లలో రాణించలేడని నాకు మ్యాచ్‌కు ముందే తెలుసు. అతను పెద్ద మ్యాచ్‌లలో ఎప్పుడూ ఆడడు. అయినా, గౌతమ్ గంభీర్ మద్దతుతో అతను కెప్టెన్ అయ్యాడని ఆరోపించాడు. కాబట్టి, అతన్ని వన్డే జట్టు నుండి తొలగించమని నేను బీసీసీఐని కోరుతున్నాను. ఎందుకంటే అతని స్థానంలో సంజు సామ్సన్, రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ వంటి చాలా మంది ప్రత్యామ్నాయాలు ఉన్నారని పేర్కొన్నాడు.

Leave A Reply

Your Email Id will not be published!