డీకే శివ‌కుమార్ రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉప ముఖ్య‌మంత్రిగా ఉన్న డీకే శివ‌కుమార్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. రాష్ట్రంలో బీజేపీ పాల‌న కు చెక్ పెడుతూ కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో కేసీసీ చీఫ్ గా డీకే కీల‌క పాత్ర పోషించారు. ఆయ‌న అక్ర‌మాస్తుల కేసులో జైలుకు కూడా పోయి వ‌చ్చారు. ఇప్పుడు సీఎంగా కీల‌క‌మైన ప‌ద‌వి వ‌రించింది. క‌ర్ణాట‌క విజ‌య సార‌థిగా, రియ‌ల్ ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరుంది శివ‌కుమార్ కు. ఆయ‌న‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. క్షేత్రస్థాయి నుండి అధికార పీఠాల వరకు సాగిన ఈ 45 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, పార్టీ, రాష్ట్రం, ప్రజల పురోగతి కోసం అలుపెరుగని కృషితో నడిచింది. డిప్యూటీ సీఎంగా, కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, 8 సార్లు ఎమ్మెల్యేగా ప‌ని చేసిన అనుభ‌వం త‌న‌కు ఉంది. 1980లో రాజ‌కీయ ప్ర‌వేశం చేశారు. ఎన్ఎస్ యుఐ లో విద్యార్థి నాయ‌కుడిగా ప్రారంభ‌మైంది. కనకపురకు చెందిన ఒక యువ డిగ్రీ విద్యార్థి, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రోత్సాహంతో 1985లో తొలిసారిగా ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. హెచ్.డి. దేవెగౌడపై సాతనూరు నుండి బ‌రిలో ఉన్న్నారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా సాత‌నూరు నుండి గెలుపు సాధించారు.

1990-1992 వ‌ర‌కు జైళ్లు , హోం గార్డుల శాఖ మంత్రిగా ప‌ని చేశారు డీకే శివ‌కుమార్. జైళ్లలో పునరావాసం మరియు నైపుణ్యాభివృద్ధి సంస్కరణలను ప్రవేశపెట్టారు.1999-2004 లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ప‌ని చేశారు. పట్టణ పరిపాలన , పౌర వ్యవస్థలను బలోపేతం చేశారు. 2014-2014 వ‌ర‌కు| ఇంధన శాఖ మంత్రిగా ఉన్నారు. కర్ణాటకలో 6,000 మెగావాట్లకు పైగా సౌర విద్యుత్‌ను సాధించేలా నాయకత్వం వహించారు.పావగడ సోలార్ పార్క్ ద్వారా బీడు భూములను అభివృద్ధి చేశారు. సూర్య రైతు ద్వారా రైతులకు సాధికారత కల్పించారు. 2018-2019 లో భారీ నీటిపారుదల, వైద్య శాఖ మంత్రిగా ప‌ని చేశారు. కరువు , వ్యవస్థాగత ఒత్తిడి సమయంలో నీటిపారుదల , ఆరోగ్య సంరక్షణ రంగాలకు మార్గనిర్దేశం చేశారు .2019 విశ్వసనీయతకు నిర్ణయాత్మక పరీక్షను ఎదుర్కొన్నారు. రాజకీయ ఒత్తిడిని తట్టుకుని నిలబడినందుకు జైలు శిక్షను అనుభవించారు. 2020 నుంచి సీఎంగా కొలువు తీరేంత వ‌ర‌కు కేపీసీసీ చీఫ్ గా ఉన్నారు డీకే శివ‌కుమార్.

Leave A Reply

Your Email Id will not be published!