శ‌తక్కొట్టిన గిల్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్

ఎలిమినేట‌ర్ -2 లో ఓట‌మి..ఆర్సీబీతో ఫైన‌ల్ కు

మ‌ల్హాన్ పూర్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ ఆఖ‌రి అంకానికి చేరుకుంది. ఈనెల 31న ఆదివారం గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో అమీ తుమీ తేల్చుకునేందుకు గుజ‌రాత్ టైటాన్స్ రెడీ అయ్యింది. ఎలిమినేట‌ర్ -1 లో ఘోరంగా ఓడి పోయిన గిల్ సేన ఉన్న‌ట్టుండి ఎలిమినేట‌ర్ -2 లో తాడే పేడో తేల్చుకుంది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో స‌త్తా చాటింది. ప్ర‌ధానంగా భారీ టార్గెట్ ను కెప్టెన్ శభ్ మ‌న్ గిల్ ముందుండి న‌డిపించాడు. త‌ను సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక చిచ్చ‌ర పిడుగు వైభ‌వ్ సూర్య‌వంశీ మ‌రోసారి రెచ్చి పోయాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశాడు. ఏ ఒక్క‌రినీ వ‌ద‌ల‌లేదు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు.

కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొని 8 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 96 ర‌న్స్ చేశాడు. ఈ ఐపీఎల్ సీజ‌న్ లో త‌న‌కు మ‌రోసారి సెంచరీ చేజారింది. మొన్న‌టి మ్యాచ్ లో కూడా కేవ‌లం 3 ప‌రుగుల తేడాతో శ‌త‌కం మిస్ అయ్యాడు వైభ‌వ్. ఆఖ‌రులో వ‌చ్చిన ఫెరీరా చక్క‌లు చూపించాడు. ఇక ర‌వీంద్ర జ‌డేజా గాయం నుంచి కోలుకుని ప‌రుగుల‌తో విరుచుకు ప‌డ్డాడు. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో రాజ‌స్తాన్ 214 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. అనంత‌రం మైదానంలోకి దిగిన గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ గిల్ , సాయి సుద‌ర్శ‌న్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడ‌టం మొద‌లు పెట్టారు. గిల్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. త‌ను 53 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 3 సిక్స‌ర్ల‌తో 104 ర‌న్స్ చేసి ఔట్ అయ్యాడు. సాయి సుద‌ర్శ‌న్ 32 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్స్ తో 58 ప‌రుగులు చేశాడు. దీంతో సునాయసంగా గుజ‌రాత్ గెలుపొందింది. ఫైన‌ల్ కు అర్హ‌త సాధించింది. ఈనెల 31న బెంగ‌ళూరుతో త‌ల‌ప‌డ‌నుంది ఐపీఎల్ టైటిల్ కోసం.

Leave A Reply

Your Email Id will not be published!