ఐపీఎల్ విజేత ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ

ఓడి పోయిన గుజ‌రాత్ టైటాన్స్ కు రూ. 12.5 కోట్లు

అహ్మ‌దాబాద్ : ఈ ఏడాది 2026లో నిర్వ‌హించిన సుదీర్ఘ , మెగా ఐపీఎల్ టోర్నీలో స‌త్తా చాటింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు . ఆ జ‌ట్టు గుజ‌రాత్ టైటాన్స్ ను ఫైన‌ల్ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో ఓడించింది విజేత‌గా నిలిచింది. ఆజ‌ట్టుకు ఈ టైటిల్ తో రూ. 20 కోట్ల ప్రైజ్ మ‌నీ ద‌క్కింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన గుజ‌రాత్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 155 ర‌న్స్ చేసింది. అనంత‌రం ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయి 18 ఓవ‌ర్ల‌లో 156 ర‌న్స్ చేసి గెలుపొందింది. ఇక ఫైన‌ల్ మ్యాచ్ లో ప‌రాజ‌యం పొందిన గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు రూ. 12. 5 కోట్లు ప్రైజ్ మ‌నీ ల‌భించింది.

ఇక ఐపీఎల్ 19వ సీజ‌న్ లో క్వాలిఫయ‌ర్ -2లో ఓడి పోయిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ రూ. 7 కోట్లు గెలుచుకుంది. ఎలిమినేట‌ర్ లో ప‌రాజ‌యం పాలైన స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప్రైజ్ మ‌నీగా రూ. 6.5 కోట్లు ద‌క్కించుకుంది. ఇదే టోర్నీలో ఆర్సీబీ త‌ర‌పున నిల‌క‌డ‌గ‌గా ఆడాడు విరాట్ కోహ్లీ. ప‌రుగుల వ‌ర‌ద తో ఆక‌ట్టుకున్నాడు. ఫైన‌ల్ మ్యాచ్ లో 75 ర‌న్స్ చేశాడు. టైటిల్ గెల‌వ‌డంతో ముఖ్య భూమిక పోషించాడు. త‌ను 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్స‌ర్లు సాధించాడు. నాటౌట్ గా నిలిచాడు. ఇక ఆర్సీబీ బౌల‌ర్లు సూప‌ర్ షో చేశారు. స‌లాం ధ‌ర్ 27 ర‌న్స్ ఇచ్చి 3 వికెట్లు తీశాడు. భువనేశ్వ‌ర్ కుమార్ 2 , హేజిల్ వుడ్ మ‌రో 2 వికెట్లు కూల్చాడు.

Leave A Reply

Your Email Id will not be published!