చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎంగా టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కొలువు తీరారు. ఇప్పటికే అత్యంత నిజాయతీ కలిగిన సీనియర్ పోలీస్ ఆఫీసర్లను కీలక పోస్టులలో ఎంపిక చేస్తూ వచ్చారు. తాజాగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన డీజీపీ పోస్టులో ఇప్పటి వరకు బాద్యతలు చేపట్టిన రాథోడ్ ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో నూతన డీజీపీగా మహేష్ కుమార్ అగర్వాల్ ను నియమించారు. ఇవాళ ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించారు. కాగా మహేష్ కుమార్ తమిళనాడుకు చెందిన 1994 ఐపీఎస్ క్యాడర్ అధికారి. సందీప్ రాయ్ రాథోడ్ ను జైళ్లు, దిద్దుబాటు సేవలు విభాగానికి డీజీపీగా నియమించింది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న స్థానాన్ని భర్తీ చేసేందుకు, జైళ్లు , దిద్దుబాటు సేవల విభాగంలో ఏడీజీపీగా పనిచేస్తున్న కె. శంకర్‌ను బదిలీ చేసింది. చెన్నైలోని సీఐడీ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోకు డీజీపీగా నియమించినట్లు వెల్లడించింది తెలంగాణ రాష్ట్ర హొం శాఖ.
మహేష్ కుమార్ అగర్వాల్ ప్రస్తుతం సరిహద్దు భద్రతా దళం లో ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తున్నారు. ఆగస్టు 2025లో డీజీపీగా శంకర్ జివాల్ పదవీ విరమణ చేసినప్పటి నుండి, గత తొమ్మిది నెలలుగా తమిళనాడుకు పూర్తి స్థాయి డీజీపీ లేరు. కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ బీఎస్ఎఫ్ నుండి అగర్వాల్‌ను ఆయన మాతృ కేడర్‌కు తక్షణమే వెనక్కి పంపేందుకు ఆమోదం తెలిపింది. కోల్‌కతా కేంద్రంగా పనిచేసే బీఎస్ఎఫ్ తూర్పు కమాండ్ అదనపు బాధ్యతలను కూడా అగర్వాల్ ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి వచ్చిన ప్రతిపాదన మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. కేంద్ర సర్వీసులకు వెళ్లడానికి ముందు, అగర్వాల్ తమిళనాడు పోలీసు విభాగంలో పలు కీలక పదవులను నిర్వహించారు. ఆయన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌గా, ఆ తర్వాత సాయుధ పోలీసు దళాల డైరెక్టర్ జనరల్‌గా , సీబీఐ సీఐడీ ప్రత్యేక డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు.
