జ‌న నాయ‌గ‌న్ లో పూజా హెగ్డే పాత్ర ప‌రిమితం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ద‌ర్శ‌కుడు హెచ్ వినోత్

చెన్నై : ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న సీఎం విజ‌య్ ముఖ్య పాత్ర పోషించిన చిత్రం జ‌న నాయ‌గ‌న్. ఈ సినిమాకు హెచ్. వినోత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. భారీ ఖ‌ర్చుతో నిర్మించారు. త‌న సినీ కెరీర్ లో ఇదే చివ‌రి సినిమా అని ప్ర‌క‌టించాడు విజ‌య్. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున త‌మ అభిమాన , ఆరాధ్య దైవంగా భావించే న‌టుడు న‌టించిన ఆఖ‌రిది కావ‌డంతో చూసేందుకు ఇప్ప‌టి నుంచే ఎగ‌బ‌డుతున్నారు. ముంద‌స్తుగా టికెట్లు బుక్ చేసుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. ఇదే స‌మ‌యంలో కీల‌క అప్ డేట్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు హెచ్ వినోత్. తాను తీసిన జ‌న నాయ‌గ‌న్ లో పూజా హెగ్డే న‌టించింద‌ని, కానీ త‌న పాత్ర కొంత వ‌ర‌కే ప‌రిమితం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పాడు. దీంతో త‌న ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

ఇక పూజా హెగ్డే విష‌యానికి వ‌స్తే త‌న సినీ కెరీర్ తొలుత త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ నుంచే స్టార్ట్ చేసింది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, హిందీ సినీ ప‌రిశ్ర‌మ‌ల‌లో ఒక ఊపు ఊపింది. కానీ ఆ త‌ర్వాత అవ‌కాశాలు త‌గ్గుతూ వ‌చ్చాయి. అయినా అడ‌పా ద‌డ‌పా కొంత వ‌ర‌కే ప‌రిమిత‌మైన పాత్ర‌ల‌ను కూడా ఒప్పుకుంది. త‌న‌కు విజ‌య్ తో న‌టించ‌డం ముఖ్య‌మ‌ని ఈ సంద‌ర్బంగా పేర్కొంది న‌టి పూజా హెగ్డే.
జూలై 23న భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రం తమిళనాడు అంతటా భారీ అంచనాలను రేకెత్తించింది, అలాగే అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా జోరందుకున్నాయి. ‘బీస్ట్’ చిత్రంలో విజయ్-పూజా హెగ్డేల విజయవంతమైన జోడీ తర్వాత, వీరిద్దరూ మళ్లీ కలిసి నటించడాన్ని చూడాలని ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నప్పటికీ, తాజా సమాచారం ఆమె అభిమానుల అంచనాలను తగ్గించింది.

ఈ చిత్రంలో పూజా ఒక టెలివిజన్ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుందని, అయితే ఆమె కేవలం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుందని హెచ్. వినోత్ వెల్లడించారు. వాస్తవానికి ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉండేదని అంగీకరిస్తూనే న‌టికి సారీ కూడా చెప్పారు. తాను మొదట స్క్రిప్ట్ రాసినప్పుడు, పూజాకు అనేక ముఖ్యమైన సన్నివేశాలు ఉండేవి అని తెలిపాడు. అయితే, తుది ఎడిటింగ్ సమయంలో సినిమా నిడివి దృష్ట్యా వాటిలో చాలా వరకు తొలగించాల్సి వచ్చిందన్నాడు హెచ్. వినోత్.

Leave A Reply

Your Email Id will not be published!