బిగ్ బాస్ 20 సీజ‌న్ టీజ‌ర్, లోగో రిలీజ్

మ‌రోసారి హోస్ట్ గా రానున్న స‌ల్మాన్ ఖాన్

ముంబై : బిగ్ బాస్ హిందీ ప్రియుల‌కు గుడ్ న్యూస్ రూపంలో అప్ డేట్ వ‌చ్చేసింది. దేశంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన రియ‌ల్టీ షోగా పేరు పొందింది. ఈసారి జ‌ర‌గ‌బోయే బిగ్ బాస్ -20 సీజ‌న్ కు కూడా హోస్ట్ గా ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు , కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఉండ‌నున్నారు. ఈ విష‌యాన్ని నిర్వాహ‌కులు అధికారికంగా ప్ర‌క‌టించారు. దీంతో షోపై మ‌రింత ఉత్కంఠ రేపుతోంది. ఇక బిగ్ బాస్ 20 క‌ల‌ర్స్ టీవీ ఛాన‌ల్ తో పాటు జియో హాట్ స్టార్ లో కూడా స్ట్రీమింగ్ కానుంది. భారతీయ టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ఒకటైన బిగ్ బాస్ హిందీ సరికొత్త సీజన్‌తో తిరిగి వస్తోంది. మైలురాయిగా నిలిచే 20వ సీజన్ సందర్భంగా, నిర్వాహకులు కొత్తగా రూపొందించిన ‘ఐ లోగోస‌ ను ఆవిష్క‌రించారు.

రెండు దశాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ అత్యంత ‘ఐ-కోనిక్’ గా నిలిచింద అనే క్యాప్షన్‌తో కూడిన టీజర్‌ను విడుదల చేశారు. 20వ సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించడానికి సల్మాన్ ఖాన్ సిద్ధమయ్యారు. ఏళ్లుగా ఈ పాపులర్ రియాలిటీ షోకు ఆయన ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు, అలాగే వారాంతపు ఎపిసోడ్లలో ఆయన చేసే సందడి ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన అంశంగా మారి పోయింది. రాబోయే సీజన్‌లో పాల్గొనే అవకాశం ఉన్నవారి జాబితా ప్ర‌స్తుతానికి బ‌య‌టకు వ‌చ్చింది. ఈ షోలో జన్నత్ జుబైర్, ఉర్ఫీ జావేద్, ఫైసల్ షేక్, రిధిమా గుప్తా , అంజలి అరోరా పేర్లు వినిపిస్తున్నాయి. పోటీలో ఉన్నట్లుగా భావిస్తున్న ఇతర పేర్లలో అర్బాజ్ పటేల్, భగీరథ్ భట్, భవ్య సింగ్, రురు ఠాకూర్, తుషార్ కర్వార్ ఉన్నారు. అయితే, నిర్వాహకులు ఇంకా అధికారిక పోటీదారుల జాబితాను ప్రకటించలేదు.

Leave A Reply

Your Email Id will not be published!