వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
ఆర్థిక రంగంలో అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి
అమెరికా : ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకమైన బ్యాంక్ గా పేరు పొందిన వరల్డ్ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రాను నియమించారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ఉన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మూడేళ్ల కాలపరిమితికి కార్యనిర్వాహక సంచాలకుడిగా నియమితులయ్యారు. తన పదవీ కాలంలో ఆయన ప్రపంచ బ్యాంకులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కీలక విధాన , అభివృద్ధి కార్యక్రమాలకు తన వంతు కృషి చేస్తారు. క్యాబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదించిన ఈ నియామకం, వాషింగ్టన్, డీసీలోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మూడేళ్ల పదవీకాలానికి ఉంటుంది. మిశ్రా పదవీ బాధ్యతలు స్వీకరించే వరకు పరమేశ్వరన్ అయ్యర్ పదవీ కాలాన్ని పొడిగించగా, ఆయన స్థానంలో మిశ్రా నియమితులవుతారు.
నీలకంఠ మిశ్రా భారతదేశంలోని అత్యంత గౌరవ నీయమైన ఆర్థికవేత్తలలో మార్కెట్ వ్యూహకర్తలలో ఒకరిగా గుర్తింపు పొందారు. మిశ్రా భారతదేశంలోని ఆర్థికవేత్తలలో , మార్కెట్ వ్యూహకర్తలలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డారు. ఆయన ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్‌లో చీఫ్ ఎకనామిస్ట్‌గా పని చేస్తున్నారు యాక్సిస్ క్యాపిటల్‌లో గ్లోబల్ రీసెర్చ్ హెడ్‌గా, హోల్-టైమ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. 2023లో యాక్సిస్ గ్రూప్‌లో చేరడానికి ముందు, ఆయన దాదాపు రెండు దశాబ్దాల పాటు క్రెడిట్ స్విస్‌లో పని చేశారు. అక్కడ ఆయన మేనేజింగ్ డైరెక్టర్, ఇండియా స్ట్రాటజిస్ట్, ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఈక్విటీ స్ట్రాటజీ కో-హెడ్‌గా సేవలందించారు..
ఆయన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM)లో పాక్షిక కాల సభ్యుడిగా ఉన్నారు. ఈ మండలి ప్రభుత్వానికి ఆర్థిక, విధానపరమైన విషయాలపై సలహాలు ఇస్తుంది. ఆధార్‌ను నిర్వహించే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాకు పాక్షిక కాల ఛైర్‌పర్సన్‌గా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాలో పాక్షిక కాల సభ్యుడిగా సేవలు అందిస్తున్నారు.
