Nagaland CM Sworn : రియో ఐదోసారి సీఎంగా ప్రమాణం
కొలువు తీరిన నెయిఫియో
Nagaland CM Sworn : ఈశాన్య ప్రాంతంలో చరిత్ర సృష్టించారు నాగాలాండ్ సీఎం నెయిఫియు రియో. ఆయన వరుసగా ఐదోసారి రాష్ట్ర సీఎంగా కొలువు తీరారు. మంగళవారం రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడం విశేషం. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నాగాలాండ్ చరిత్రలోనే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా నెయిఫియు రియో(Nagaland CM Sworn) పేరు పొందారు. తన పార్టీకి భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. నెయిఫియు రియోకు 72 ఏళ్లు. ఈ రాజకీయ వృద్దుడితో గవర్నర్ లా గణేశన్ ప్రమాణం చేయించారు సీఎంగా.
ఆయనతో పాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులుగా టిఆర్ జెలియాంగ్ , వై పాటన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో నాగాలాండ్ క్యాబినెట్ లో కొత్తగా కొలువు తీరిన మంత్రులు సైతం ప్రమాణం చేశారు. ఇక సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ గా నిలిచారు రాష్ట్ర బీజేపీ చీఫ్ టెమ్ జెన్ ఇమ్నా అలోంగ్. ఆయన తన చిన్నపాటి కళ్లు, హాస్యంతో హాట్ టాపిక్ గా మారారు.
ఇక నాగాలాండ్ ఎన్నికల్లో మొదటిసారిగా ఎన్నికైన ఇద్దరు మహిళల్లో ఒకరైన సల్హౌటుయోనువో క్రూసే మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక పీఎం, షాతో పాటు బీజేపీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా, అస్సాం సీఎం , ఎన్ఈడీఏ కన్వీనర్ హిమంత బిస్వా శర్మ పాల్గొన్నారు.
Also Read : 24 గంటల్లో మంత్రులకు శాఖలు – సీఎం