Ambarien Alqadar : హిజాబ్ పై ‘అల్కాదర్’ ధిక్కారం
స్వేచ్ఛ కోసం పోరాట స్వరం
Ambarien Alqadar : అంబారియన్ అల్కాదర్ ధిక్కారానికి ప్రతిరూపంగా మారారు. ఆమె తన తల్లి హిజాబ్ ధరిస్తే తాను మాత్రం ఒప్పుకోనంటూ తెగేసి చెప్పింది. పరదా అనేది శరీరానికే కాని మనసుకు కాదని ప్రకటించింది.
ఒక రకంగా ఆమె ధిక్కార స్వరాన్ని వినిపించింది బలంగా. ఈ దేశంలో ఇప్పుడు హిజాబ్ అనేది ఒక ప్రధాన సమస్యగా మారింది. కర్ణాటకలో రేగిన ఈ వివాదం ప్రపంచాన్ని ఆకర్షించేలా చేసింది.
చివరకు కోర్టు మెట్లు కూడా ఎక్కింది. కానీ ఎక్కడా పరిష్కారానికి నోచుకోలేదు. స్వేచ్ఛ అన్నది లేకుండా ఎలా ఉండగలమని ప్రశ్నిస్తుంది అంబారియన్ అల్కాదర్(Ambarien Alqadar) .
నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తాను. కానీ స్వేచ్ఛను మాత్రం కోల్పోనని తెగేసి చెప్పింది. ఈ సందర్బంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
హిజాబ్ అణచివేతకు చిహ్నంగా లేదా ప్రజాస్వామ్య హక్కులకు ఒక మూలాంశం కాదా అనేది ఆయా సందర్భం మీద ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది అల్కాదర్.
రాజకీయాలకు ఒక సాధనంగా మారడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చిత్ర నిర్మాత అయిన అంబారియన్ అల్కాదర్(Ambarien Alqadar) వీలింగ్ ఆన్ హిజాబ్ వ్యాసం కలకలం రేపింది.
నా తల్లి టీ పార్టీలు, విందులు, కవిత్వ పఠనాలను నిర్వహించింది. లౌకిక భారతీయ ముస్లింగా చూడాలని అనుకుంది. తన బుర్కాను ఎందుకు ధరించలేదంటూ అడిగా.
భారతీయ ముస్లిం వలే తనను తాను ప్రపంచానికి ఎలా పరిచయం చేసుకుందనే దానిపై ఉత్సుకత కలిగి ఉండడం సహజం. 1984లో న్యూఢిల్లీకి చేరుకుంది. ఇదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాలలో చోటు చేసుకున్న పరిణామాల గురించి కూడా ప్రస్తావించింది.
1987లో హషింపురాలో , 1989లో భగల్పూర్ లో, 1992లో ముంబై , 2002లో గుజరాత్ లో చోటు చేసిన ఘటనలను గుర్తు చేసింది. ఆధునిక వస్త్రాలు ధరించాను. పరదా అనేది శరీరానికే కాని మనసుకు కాదంటోంది అల్కాదర్.
Also Read : జైబా సారంగ్ ఇథింక్ లాజిస్టిక్స్