PM Modi Anthony : ప్రధానులతో కెప్టెన్ల కరచాలనం
భారత జాతీయ గీతానికి అభివాదం
PM Modi Anthony Shake Hand : గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం నరేంద్ర మోదీ పేరుతో దద్దరిల్లి పోయింది. వేలాది మంది స్టేడియంకు హాజరయ్యారు. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ గురువారం అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది.
ఈ టెస్టు ప్రపంచ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోనుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ ఆల్బనీస్ , భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ(PM Modi Anthony) హాజరయ్యారు.
ఈ సందర్బంగా జి20 సమావేశానికి హాజరయ్యేందుకు ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడి నుంచి ఇవాళ అహ్మదాబాద్ కు చేరుకున్నారు. అంతకు ముందు అహ్మదాబాద్ లో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. ఇదిలా ఉండగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది భారత ప్రభుత్వం.
అహ్మదాబాద్ స్టేడియంలో జరుగుతున్న నాలుగో టెస్టు ను చూసేందుకు విచ్చేసిన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ ఆల్బనీస్ కు ఘన స్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ సీఎం కూడా ఉన్నారు. బీసీసీఐ సెక్రటరీ జే షాతో పాటు పలువురు ప్రముఖులు స్టేడియంలో కొలువు తీరారు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు దేశాల ప్రధాన మంత్రులు ఆస్ట్రేలియా , భారత క్రికెట్ జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లో కొద్ది సేపు సంభాషించారు మోదీ, ఆంథోనీ(PM Modi Anthony Shake Hand). భారత జాతీయ గీతాన్ని ఆలాపించారు. అందరూ లేచి నిలబడి అభివాదం చేశారు.
Also Read : దాదా గోల్డ్ స్మగ్లర్ కు ఫ్యాన్స్ ఫిదా