PM Modi Anthony : మోదీ ఆంథోనీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
అహ్మదాబాద్ టెస్టులో పీఎంలకు ఫిదా
PM Modi Anthony Test Match : గుజరాత్ లోని అహ్మదాబాద్ మోదీ స్టేడియంలో భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్ అత్యత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా పీఎం ఆంథోనీ ఆల్బనీస్ హాజరయ్యారు. అంతకు ముందు స్టేడియం వెలుపల పీఎం ఆంథోనీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఆయనను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ కొద్ది సేపు సంభాషించారు.
అనంతరం భారీ భద్రత మధ్య స్టేడియం లోపలకు చేరుకున్నారు. వేలాది మంది స్టేడియంకు హాజరయ్యారు. భారత్ , ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభం కంటే ముందు స్టేడియం అంతటా కలియ తిరిగారు ఇద్దరు ప్రధానులు మోదీ, ఆంథోనీ(PM Modi Anthony Test Match) . క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా భారత జాతీయ గీతాన్ని ఆలాపించారు. ఇరు జట్ల క్రికెటర్లు మౌనం పాటించారు. వారితో పాటు ప్రధానులు మోదీ, ఆంథోనీ ఉండడం విశేషం.
కెప్టెన్లు స్టీవ్ స్మిత్ , రోహిత్ శర్మ తమ జట్లలోని క్రికెటర్లను ప్రధాన మంత్రులు మోదీ, ఆంథోనీకి పరిచయం చేశారు. మ్యాచ్ సందర్భంగా టాస్ వేశారు. ముందుగా ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. స్టేడియంలో మోదీ, ఆంథోనీ కలిసి మ్యాచ్ ను (PM Modi Anthony) చూశారు. పీఎంలతో పాటు బీసీసీఐ చీఫ్ రోజర్ బిన్నీ, సెక్రటరీ జే షా, సీఎం పటేల్ కూడా పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా మూడు టెస్టులు జరిగాయి. ఇందులో నాగ్ పూర్ , ఢిల్లీ లో భారత్ గెలుపొందగా ఇండోర్ లో ఆసిస్ విజయం సాధించింది.
Also Read : ప్రధానులతో కెప్టెన్ల కరచాలనం